Webdunia - Bharat's app for daily news and videos

Install App

యు.ఎస్‌.ఎలో గాంఢీవధారి అర్జున నయా షెడ్యూల్

Webdunia
మంగళవారం, 7 మార్చి 2023 (10:44 IST)
Varuntej at monitar
వ‌రుణ్‌తేజ్ యాక్ష‌న్ మోడ్‌లోకి దిగేశారు. ఆయ‌న న‌టిస్తున్న ‘గాంఢీవ‌ధారి అర్జున’ సినిమా న‌యా షెడ్యూల్ యుఎస్ఎలో జ‌రుగుతోంది. గ‌రుడ వేగ ఫేమ్ స్టైలిష్ ఫిల్మ్ మేక‌ర్ ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా గాంఢీవ‌ధ‌రాఇ అర్జున‌. ఇటీవ‌ల మేక‌ర్స్ విడుద‌ల చేసిన స్ట్రైకింగ్ గ్లింప్స్ కి, టైటిల్‌కి అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది. సినిమా మీద అంచ‌నాలు పెంచేస్తోంది గ్లింప్స్.
 
 అక్టోబ‌ర్ నుంచి శ‌ర వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది ‘గాంఢీవ‌ధారి అర్జున‌’. ఇటీవ‌ల యూరోపియ‌న్ కంట్రీస్‌లో భారీ షెడ్యూల్‌ని పూర్తి చేశారు. యాక్ష‌న్ సీక్వెన్స్ కోసం ఫారిన్ టెక్నీషియ‌న్లు ప‌నిచేస్తున్నారు. ముసోరిలో పిక్చ‌ర్‌స్క్వేర్ లొకేష‌న్ల‌లో న‌యా షెడ్యూల్‌ని ప్రారంభించారు. 
 
ఈ షెడ్యూల్లో అత్యంత భారీ యాక్ష‌న్ ఎపిసోడ్స్‌ని తెర‌కెక్కిస్తున్నారు. అద్భుత‌మైన ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్‌తో రూపొందిస్తున్నారు బీవీయ‌స్‌య‌న్ ప్ర‌సాద్‌, బాపినీడు. ఎస్వీసీసీ ప‌తాకంపై తెర‌కెక్కుతోంది ఈ సినిమా. వ‌రుణ్‌తేజ్ ఈ చిత్రంలో సెక్యూరిటీ ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తారు. అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన ప‌రిస్థితుల నుంచి ప్ర‌జ‌లను అత‌ను ఎలా కాపాడాడు, అత‌ని స్ట్రాట‌జీస్ ఏంటి? అనేది ఆస‌క్తిక‌రం. 
 
వ‌రుణ్‌తేజ్ కెరీర్‌లో అత్యంత భారీ చిత్రం ఇదే. మిలిట‌రీ ఔట్‌ఫిట్‌లో వ‌రుణ్‌తేజ్ లుక్ చూసిన వారు  అద్భుతంగా ఉంద‌ని మెచ్చుకుంటున్నారు.  సంగీతం:  మిక్కీ.జె.మేయ‌ర్‌. గాంఢీవ‌ధారి అర్జున‌కు సంబంధించిన మిగిలిన విష‌యాల‌న్నీ త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల‌తో పంచుకుంటామ‌ని అంటున్నారు మేక‌ర్స్.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments