Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూ ఏజ్ లవ్ స్టోరీ బేబీ ప్రారంభం

Webdunia
గురువారం, 14 అక్టోబరు 2021 (17:18 IST)
Baby movie launching
న్యూ ఏజ్ లవ్ స్టోరీ తో తెరకెక్కనున్న 'బేబీ' చిత్రం నేడు నేడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ తో పాటు వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించునున్నారు.
 
ఈ సందర్బంగా చిత్రం బృందాన్ని ఆశీర్వదిస్తూ నిర్మాత అల్లు అరవింద్ మొదటి క్లాప్ ఇచ్చారు, సుకుమార్ కెమెరా ఆన్ చేయగా, డైరెక్టర్ మారుతి మొదటి షాట్ డైరెక్ట్ చేసారు.
 
విజయ్ దేవరకొండ తో `టాక్సీవాలా` మూవీ ని సొంతంగా నిర్మించి విజయాన్ని అందుకున్న ఎస్. కె. ఎన్ ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. సాయి రాజేష్ ఈ మూవీ కి దర్శకత్వం వహించనున్నారు.
 
చిత్ర నిర్మాణ సంస్థ మాస్ మూవీ మేకర్స్ అధినేతలు ఎస్. కే. ఎన్ & మారుతి ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ షూట్ ఈ నెల 20 నుండి ప్రారంభం కానుందని చెప్పారు.
 
విజయ్ బుల్గానిన్ ఈ చిత్రానికి సంగీతం ఇస్తుండగా రామ్ రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నారు.ఈ చిత్రానికి 100 పర్సెంట్ లవ్, వన్ నేనొక్కడినే,పుష్ప లాంటి భారీ చిత్రాలకు ఎడిటర్ గా పని చేసిన కార్తిక్ శ్రీనివాస్ ఈ చిత్రానికి కూడా పని చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్యార్థిని తల్లిపై మోజుపడి మృత్యు ఒడిలోకి చేరుకున్న యువకుడు

ఏపీ ఆర్ఎస్ ఎన్నికలు.. ఆ మూడో సీటు ఎవరికి?

కుమారుడిని చంపేందుకు లక్ష రూపాయలు సుఫారీ ఇచ్చిన తండ్రి

అచ్చం మనిషిలా మారిపోయిన వానరం.. ఎలాగంటే? (Video)

ఈ మంత్రి పదవి జనసేనాని భిక్షే : మంత్రి కందుల దుర్గేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments