Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నెట్' టీజర్ విడుదల - అవికా గోర్ ఇంట్లో ఎవరున్నారు?(Video)

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (19:06 IST)
Rahul-Avika
వివిధ భారతీయ భాషల్లో, వివిధ జానర్లలో సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్ సినిమాలు, ముఖ్యంగా ఒరిజినల్ మూవీస్ అందిస్తూ.అత్యధిక వీక్షకాదరణ సొంతం చేసుకున్న అగ్రగామి ఓటీటీ వేదిక 'జీ 5స‌. వీక్షకులకు వినోదం అందించే విషయంలో ఏమాత్రం తగ్గేది లే అంటోంది. గత ఏడాది ఏప్రిల్‌లో 'అమృతరామమ్' సినిమాను డైరెక్టుగా డిజిటల్ రిలీజ్ చేసింది. '47 డేస్', 'మేక సూరి', ఈ ఏడాది 'బట్టల రామస్వామి బయోపిక్కు', 'రూమ్ నంబర్ 54' వెబ్ సిరీస్‌లను 'జీ 5' ప్రజల ముందుకు తీసుకొచ్చింది. త్వరలో 'జీ 5' ఒరిజినల్ మూవీ 'నెట్' విడుదల చేయడానికి సిద్ధమైంది.
 
రాహుల్ రామకృష్ణ, లక్ష్మణ్, అవికా గోర్, ప్రియా, ప్రణీతా పాఠక్, సుచిత్ర, విశ్వదేవ్, రంజిత్ ప్రధాన తారాగణంగా రూపొందిన 'జీ 5' ఒరిజినల్ మూవీ 'నెట్'. భార్గవ్ మాచర్ల దర్శకత్వం వహించారు. రాహుల్ తమడా, సందీప్ రెడ్డి బొర్రా నిర్మించారు. గురువారం 'నెట్' టీజర్ విడుదల చేశారు.
 
టీజ‌ర్‌లో ఏముందంటే,
అవికా గోర్ ఒక ఫ్లాట్ లో ఉంటుంది. దాని నిండా సీక్రెట్ కెమెరాలు. ఆమె ఏం చేస్తున్నదీ తన ఫోనులో రాహుల్ రామకృష్ణ చూస్తుంటాడు. ఆఖరికి బాత్‌రూమ్‌కు వెళ్లినా సరే! ఒకరోజు ఫోన్ చూస్తూ 'మీ ఇంట్లో ఉన్నాడు మీ ఇంట్లో ఉన్నోడు' అని అరుస్తాడు. అవికా గోర్ ఇంట్లో ఎవరున్నారు? ఏమైంది? అనే అంశాలు వీక్షకుల్లో ఆసక్తి రేపాయి. సెప్టెంబర్ 10న 'జీ 5' ఓటీటీ వేదికలో సినిమా ప్రీమియర్ కానుంది.
 
వీక్షకులకు ఆద్యంతం థ్రిల్ ఇచ్చే చక్కటి చిత్రమిదని దర్శక నిర్మాతలు తెలిపారు. 'నెట్' అందర్నీ ఆకట్టుకుంటుందని 'జీ 5' వర్గాలు వెల్లడించాయి.
 
రాహుల్ రామకృష్ణ, లక్ష్మణ్, అవికా గోర్, ప్రియా, ప్రణీతా పాఠక్, సుచిత్ర, విశ్వదేవ్, రంజిత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎడిటర్: రవితేజ గిరిజాల, సినిమాటోగ్రాఫర్: అభిరాజ్ నాయర్, మ్యూజిక్: నరేష్ కుమరన్, ప్రొడ్యూసర్స్: రాహుల్ తమడా, సాయిదీప్  రెడ్డి బొర్రా, క్రియేటర్ - రైటర్ - స్క్రీన్ ప్లే - డైరెక్టర్ : భార్గవ్ మాచర్ల.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments