Webdunia - Bharat's app for daily news and videos

Install App

1980 నాటి క‌థ‌తో నేను c/o నువ్వు

Webdunia
శుక్రవారం, 29 జులై 2022 (17:31 IST)
Kolli Ramakrishna and others
ఆగాపే అకాడమీ పతాకంపై రతన్ కిషోర్,సన్య సిన్హా, సాగారెడ్డి, సత్య,ధన, గౌతమ్ రాజ్ నటీ,నటులుగా సాగారెడ్డి తుమ్మ దర్శకత్వంలో నిర్మిస్తున్న  అతవుల, శేషిరెడ్డి, దుర్గేష్ రెడ్డి, కె .జోషఫ్ లు  సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘'నేను c/o నువ్వు'’.అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 9 న  ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవుతున్న సందర్బంగా ఈ చిత్ర మోషన్  పోస్టర్‌ ను హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఫిలిం ఛాంబర్  ప్రెసిడెంట్ కొల్లి రామకృష్ణ "నేను c/o నువ్వు'’ చిత్ర మోషన్  పోస్టర్ లాంచ్ చేశారు.. ఈ కార్యక్రమం లో చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబందించి ఒక చిన్న సాంగ్ కు డ్యాన్స్ కంపోజ్ చేసి పంపిస్తే లక్ష  రూపాయలు ప్రైజ్ మనీని అందజేస్తామని తెలిపారు.
 
ముఖ్య అతిధులుగా విచ్చేసిన ఫిలిం ఛాంబర్  ప్రెసిడెంట్ కొల్లి రామకృష్ణ మాట్లాడుతూ.. నాకు ఈ చిత్ర దర్శకుడు సాగా పది సంవత్సరాల నుండి తెలుసు . సినిమా రంగంపై ఎంతో ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీ కి వచ్చాడు. ఇది సాగా కు రెండో చిత్రం. ఈ సినిమా కోసం తానే దగ్గరుండి కథాల, స్క్రీన్ ప్లే దర్శకత్వం అన్నీ తన బుజాలమీద వేసుకుని ఈ చిత్రాన్ని ముందుకు తీసుకువెళ్లాడు.. ఈ చిత్రంలో ఉన్న ఫైట్స్, మ్యూజిక్ చాలా బాగావచ్చాయి .ఈ చిత్ర యూనిట్ కు అల్ ధ బెస్ట్ అన్నారు.
 
చిత్ర దర్శకుడు సాగా రెడ్డి తుమ్మ మాట్లాడుతూ.. 1980 లో నా చిన్న తనంలో నేను దగ్గరగా చూసిన  కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించాను. ఈ చిత్రానికి పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్, పాటల రచయిత తో పాటు మొత్తం టెక్నిసియన్స్  అందరూ నాకు మంచి స్నేహితులు. అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. చిన్న సినిమాలను దయచేసి సపోర్ట్ చేయండి.సెప్టెంబర్ 9 న ప్రపంచ వ్యాప్తం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.
 
సహ నిర్మాత జోషఫ్ మాట్లాడుతూ.. నాకు దర్శకుడు సాగా కథ చెప్పగానే నచ్చి ఈ  ప్రాజెక్ట్ లొకి వచ్చాను. సాగా ఎంతో విజనరీ ఉన్న డైరెక్టర్. పోస్టర్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఓ వైపు వివాహ శుభకార్యాన్ని చూపిస్తూ ,  మరోవైపు సంకెళ్ళ తో కాళ్ళను బందించిన  ఒక చిన్న క్రైమ్ స్టోరీ లా క్రియేట్ అయ్యేలా పోస్టర్ కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే కథ డిఫరెంట్ గా ఉంటుందని అర్థం అవుతుంది.ఈ సినిమా చూశాను విడుదల కోసం ఎంతో ఆత్రుత గా ఎదురుచూస్తూ న్నాను ఉన్నాను. సెప్టెంబర్  9 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా  అందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments