Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీరాజనం షూటింగ్ ప్రారంభం: షాపింగ్ మాల్ మహేష్, సబ్యసాచి హీరోలుగా..

Webdunia
శుక్రవారం, 24 జులై 2015 (14:09 IST)
మహాలక్ష్మీ మూవీస్‌ పతాకంపై సబ్యసాచి, మహేష్‌, బన్నీ, కారుణ్య, ప్రధాన తారాగణంగా అవన్‌ ఆళ్ళ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'నీరాజనం'. దాడి అప్పలనాయుడు నిర్మిస్తున్న ఈ చిత్రం గురువారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. సబ్యసాచి, మహేష్‌, బన్నీ, కారుణ్యపై చిత్రించిన ముహూర్తపు షాట్‌కు దర్శకుడు సముద్ర క్లాప్‌ కొట్టగా, బెల్లంకొండ సురేష్‌ కెమేరా స్విచ్చాన్‌ చేశారు. ఎం.ఎల్‌.ఎ. ఆర్‌.కృష్ణయ్య గౌరవ దర్శకత్వం వహించారు. 
 
అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ... సినిమా ప్రభావం సమాజంపై వుంటుంది. కాబట్టి మంచి చిత్రాలు నిర్మించే బాధ్యత దర్శకులదే, అందుకే మంచి సినిమాతీసి విజయాన్ని సాధించాలని ఈ చిత్ర దర్శక నిర్మాతలకు సూచించారు.
 
చిత్ర దర్శకుడు అవన్‌ మాట్లాడుతూ... ముక్కోణపు ప్రేమకథ ఇది. ప్రేక్షకులకు నచ్చే అంశాలన్నీ ఇందులో వున్నాయి. ఈరోజు షూటింగ్‌ ప్రారంభించాం. మరలా కొద్దిరోజుల గ్యాప్‌ తర్వాత రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతుంది' అన్నారు.
 
'కథ నచ్చి దర్శకుడిపై నమ్మకంతో నిర్మాణంలోకి ప్రవేశించామని' దాడి అప్పలనాయుడు తెలిపారు. ఒరిస్సాలో హీరోగా చేస్తూ తెలుగులో పరిచయం అవుతున్న సబ్యసాచి తెలుపుతూ.. మంచి కథతో రూపొందిన ఈ చిత్రంలో నటించడం ఆనందంగా వుందన్నారు.
 
'షాపింగ్‌మాల్‌'లో నటించిన మహేష్‌ మాట్లాడుతూ.. ఇందులో తాను ఓ హీరోగా నటిస్తున్నానన్నారు. సంగీత దర్శకుడు ఎస్‌ఆర్‌ శంకర్‌ మాట్లాడుతూ..'చండీ' చిత్రంతో ప్రారంభమైన నా ప్రయాణం పలు చిత్రాలకు బలం చేకూర్చేలా సంగీతం తోడ్పడింది. ఇది సంగీతనేపథ్యంలో సాగే ప్రేమకథ. పాటలకు ప్రాధాన్యత వుంది. మంచి బాణీలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నానని' తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: మహిశేర్ల, ఆర్ట్‌: విజయ్‌కృష్ణ, మాటలు: రవి ఐ.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments