నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా.. యూట్యూబ్‌లో కొత్త రికార్డ్

Webdunia
బుధవారం, 3 జూన్ 2020 (17:38 IST)
పాపులర్ యాంకర్ ప్రదీప్ ప్రస్తుతం హీరోగా మారుతున్న సంగతి తెలిసిందే. ''30 రోజుల్లో ప్రేమించటం ఎలా?" అనే సినిమాలో ప్రదీప్ హీరోగా నటిస్తున్నాడు. షెడ్యూల్‌ ప్రకారం ఉగాది కానుకగా మార్చి 25న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. ఇక ఈ సినిమాలోని 'నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా' పాట యూట్యూబ్‌లో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. 
 
సంగీత ప్రియుల ఆదరణతో 150 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి, చిన్న సినిమాల పాటల్లో ఈ ఫీట్ సాధించిన సాంగ్‌గా సరికొత్త మైలురాయి అందుకుంది. ప్రముఖ డైరెక్టర్‌ సుకుమార్ దగ్గర 'ఆర్య 2', '1.. నేనొక్కడినే' చిత్రాలకు పనిచేసిన మున్నా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్వీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఎస్వీ బాబు నిర్మిస్తున్నారు. 
 
ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చగా.. 'నీలి నీలి ఆకాశం' పాటతో సహా చిత్రంలోని అన్ని పాటలనూ చంద్రబోస్ రాశారు. ప్రదీప్‌, అమృతా అయ్యర్‌పై చిత్రీకరించిన 'నీలి నీలి ఆకాశం' పాట 150 మిలియన్ వ్యూస్ దాటడంతో చిత్ర బృందం హర్షం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

హిడ్మా తల్లితో భోజనం చేసిన ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి.. వారం రోజుల్లో హిడ్మా హతం

బెట్టింగ్స్ యాప్స్ యాడ్స్ ప్రమోషన్ - 4 ఖాతాల్లో రూ.20 కోట్లు ... ఇమ్మడి రవి నేపథ్యమిదీ...

అమెరికా 15 సంవత్సరాలు టెక్కీగా పనిచేశాడు.. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments