సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ కేసు.. ఇద్దరు అరెస్ట్.. వాళ్లెవరంటే?

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2020 (18:26 IST)
బాలీవుడ్ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో తొలి అరెస్టు చోటుచేసుకుంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మృతి కేసును సీబీఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రియాను పలుమార్లు ప్రశ్నించిన సీబీఐ, తొలిసారిగా ఆమె తల్లితండ్రులు ఇంద్రజిత్‌ చక్రవర్తి, సంధ్యలను సుమారు ఎనిమిది గంటల పాటు విచారించారు.
 
ఈ కేసులో మాదక ద్రవ్యాల కోణం ఉందనే అంశానికి సంబంధించి.. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. వారిలో ఒకరైన అబ్దుల్‌ బాసిత్‌ పరిహార్‌ను తాము ముంబయిలోని బాంద్రాలో అరెస్టు చేసినట్టు సంస్థ తెలిపింది. బాసిత్‌కు సుశాంత్ మేనేజర్ సామ్యూల్ మిరాండాతో సంబంధాలున్నట్టు తెలిసిందే. 
 
మిరాండా, రియా చక్రవర్తి సోదరుడు షోవిక్‌ చక్రవర్తి సూచనల మేరకు మాదక ద్రవ్యాలను సేకరించినట్టు తమకు సమాచారం ఉందని ఎన్‌సీబీ తెలిపింది. సుశాంత్‌ మాజీ మేనేజర్ మిరాండాను రియా చక్రవర్తి గత సంవత్సరం మే నెలలో నియమించారు. ఆయన సుశాంత్‌ ఇంటి నిర్వహణ, ఖర్చులు తదితర అన్ని వ్యవహారాలు చూసుకునేవారు. ఈయనపై సుశాంత్ కుటుంబ సభ్యులు డ్రగ్స్‌ సరఫరా చేయటం, సుశాంత్‌ డబ్బును భారీగా దుర్వినియోగం చేయటం వంటి ఆరోపణలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బోరబండలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, ఎందుకు?

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసు : సహ కుట్రదారు జసిర్ అరెస్టు

Telangana deep freeze: తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి-పులి

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? హస్తినలో మకాం వేసిన సిద్ధూ - డీకే

భార్య, కవల పిల్లలు మృతి.. ఇక బతకలేను.. ఉరేసుకున్న వ్యక్తి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments