Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి కి NBK109 మూవీ టైటిల్ టీజర్, సంక్రాంతి సినిమా

డీవీ
ఆదివారం, 13 అక్టోబరు 2024 (10:21 IST)
NBK 109 poster
ఇటీవలే బాలక్రిష్ణ 109 చిత్రం అప్ డేట్ దసరాకు చెబుతునానని ప్రకటించిన నిర్మాత నాగవంశీ ఓ పోస్టర్ తో వెల్లడించారు. నందమూరి బాలకృష్ణ  మాస్ ని మెప్పించే యాక్షన్ ఎంటర్‌టైనర్‌లను  అందించడంలో ఆయన దిట్ట. కొన్నేళ్లుగా అపజయమెరుగకుండా వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ, తన 109వ చిత్రం 'NBK109' కోసం బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ లో చేస్తున్నారు.
 
ఇప్పటివరకు, నిర్మాతలు ఈ చిత్ర టైటిల్‌ను వెల్లడించలేదు. దీంతో టైటిల్ తో పాటు, ఈ సినిమాకి సంబంధించిన ఇతర విషయాలు తెలుసుకోవాలని అభిమానులు, సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ దీపావళికి వారి నిరీక్షణకు తెరపడనుంది. దీపావళి శుభ సందర్భంగా,  'NBK109' టైటిల్ టీజర్‌ను విడుదల చేయనున్నారు.
 
ఈ సందర్భంగా నిర్మాతలు ఒక పోస్టర్ ను విడుదల చేశారు. దీనిలో గుర్రంపై స్వారీ చేస్తున్న నందమూరి బాలకృష్ణ లుక్ రాజసం ఉట్టిపడేలా ఉంది. ఈ చిత్రంలో గాడ్ ఆఫ్ మాసెస్ ని దర్శకుడు బాబీ, వయొలెంట్ పాత్రలో స్టైలిష్ గా చూపించబోతున్నారని స్పష్టమవుతోంది.
 
ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రానికి సంచలన స్వరకర్త ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు. కళా దర్శకుడిగా అవినాష్ కొల్లా, ఎడిటర్ గా నిరంజన్ దేవరమానే వ్యవహరిస్తున్నారు.
 
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ఈ చిత్రం 2025 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను తప్పు చేసానని తేలితే అరెస్ట్ చేస్కోవచ్చు: పోసాని కృష్ణమురళి

కట్టుకున్నోడికి పునర్జన్మనిచ్చిన అర్థాంగి.. కాలేయం దానం చేసింది.. (video)

స్నేహితుడి పెళ్లిలో గిఫ్ట్ ఇస్తూ గుండెపోటుతో కుప్పకూలి యువకుడు మృతి (video)

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో గెలుపు ఎవరిది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయ్.. బీజేపీ?

లోన్ యాప్‌లు, బెట్టింగ్ సైట్‌ల భరతం పడతాం... హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments