Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమలో పడలేదు... నిర్మాతగా మారలేదు : స్పష్టంచేసిన లేడీ సూపర్ స్టార్

నయనతార... దక్షిణాదిలో ఉన్న హీరోయిన్లలో ఒకరు. ఈమె ప్రేమాయణాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ హీరో శింబు, ఆ తర్వాత నృత్యదర్శకుడు ప్రభుదేవా, ఇపుడు దర్శకుడు విఘ్నేష్‌లు ఉన్నారు. విఘ్నేష్‌తో కలిస

Webdunia
శుక్రవారం, 22 జూన్ 2018 (16:44 IST)
నయనతార... దక్షిణాదిలో ఉన్న హీరోయిన్లలో ఒకరు. ఈమె ప్రేమాయణాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ హీరో శింబు, ఆ తర్వాత నృత్యదర్శకుడు ప్రభుదేవా, ఇపుడు దర్శకుడు విఘ్నేష్‌లు ఉన్నారు. విఘ్నేష్‌తో కలిసి ఒకే ఇంట్లో సహజీవనం చేస్తోంది. అయితే, త‌న ప్రియుడికి ద‌ర్శ‌కుడిగా స‌రైన అవ‌కాశాలు లేకపోవడంతో స్వ‌యంగా న‌య‌న‌తార నిర్మాత‌గా మారింద‌ని కోలీవుడ్ వ‌ర్గాలు కోడై కూస్తున్నాయి.
 
ముఖ్యంగా, విఘ్నేష్ రూపొందిస్తున్న 'ఇద‌యం ముర‌ళీ' సినిమా నయన‌తారే నిర్మాత‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ వార్త‌ల‌ను తాజాగా న‌య‌న్ కొట్టిపారేసింది. "నేను నిర్మాత‌గా మారాన‌న్న‌ది పూర్తిగా అవాస్త‌వం. ఆ వార్త‌ల‌ను నమ్మ‌కండి. నేను ప్ర‌స్తుతం న‌ట‌న‌పైనే పూర్తి దృష్టి కేంద్రీక‌రించాన‌ు" అని చెప్పుకొచ్చింది. 
 
కాగా, హీరోల‌తో స‌మాన‌మైన ఇమేజ్‌ను సంపాదించుకుని లేడీ సూప‌ర్‌స్టార్‌గా నయనతార చెలామ‌ణి అవుతున్న విషయం తెల్సిందే. క‌థానాయిక ప్రాధాన్య‌మున్న సినిమాల్లోనూ న‌టిస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్‌ను సృష్టించుకుంది. అంతేకాకుండా ద‌క్షిణాదిలోనే అత్య‌ధిక పారితోషికం అందుకుంటున్న తారామ‌ణిగా కూడా నిలిచింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Perfume Day 2025: పెర్ఫ్యూమ్‌ డే.. వ్యక్తిగత గుర్తింపు కోసం సిగ్నేచర్ సెంట్‌

ఆన్‌లైన్ బెట్టింగుతో నష్టపోయా, చనిపోతున్నా క్షమించు తమ్ముడూ సెల్ఫీ(video)

కేసీఆర్ పుట్టిన రోజు : ఫ్లెక్సీలను తొలగించండి.. (Video)

బీజేపీలో చేరనున్న మాజీ ఎంపీ కేశినేని నాని..?

కిడ్నీదానం చేసి భర్తను బతికించుకున్న మహిళ.. లారీ రూపంలో మృత్యువు వెంటాడింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments