Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంఘమిత్ర రేసులో అనుష్క, నయనతార: ఎవరికి ఆ ఛాన్స్ దక్కుతుందో?

సంఘమిత్రగా శ్రుతిహాసన్ కనిపిస్తుందని అందరూ అనుకున్నారు. అయితే ఆ సినిమా నుంచి డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో శ్రుతిహాసన్ ఈ సినిమా నుంచి తప్పుకుండా. దీంతో టైటిల్ రోల్ కోసం వేట మొదలెట్టారు. అయితే దక్షిణాదిన

Webdunia
సోమవారం, 5 జూన్ 2017 (11:53 IST)
సంఘమిత్రగా శ్రుతిహాసన్ కనిపిస్తుందని అందరూ అనుకున్నారు. అయితే ఆ సినిమా నుంచి డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో శ్రుతిహాసన్ ఈ సినిమా నుంచి తప్పుకుండా. దీంతో టైటిల్ రోల్ కోసం వేట మొదలెట్టారు. అయితే దక్షిణాదిన లేడి ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన అనుష్కనే సంఘమిత్రగా నటించాలని అడిగారట. 
 
ముందుగా తమన్నా, కాజల్, దీపికా పడుకునేల పేర్లు వినిపించినా.. చివరికి అనుష్కనే సుందర్ సి ఖాయం చేసినట్లు తెలుస్తోంది. సినీ నటి ఖుష్బూ భర్త, సినీ నటుడు సుందర్ సి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. 
 
జయం రవి, ఆర్యలు హీరోలుగా, శ్రుతిహాసన్ టైటిల్ రోల్ అనుకున్నా..  తనకు డేట్స్ విషయంలో క్లారిటీ ఇవ్వటం లేదన్న కారణంతో సంఘమిత్ర నుంచి తప్పుకుంటున్నట్టుగా తెలిపింది శృతిహాసన్. దీంతో టైటిల్ రోల్ కోసం మరో స్టార్ హీరోయిన్ కోసం ప్రయత్నాలు ప్రారంభించిన చిత్రయూనిట్ అనుష్కనే సంప్రదించిందట. అయితే అనుష్క ఈ ఛాన్సుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా లేదా అనేది తెలియాలంటే కాస్త వేచి చూడాల్సిందే. ఇంకా నయనతార కూడా సంఘమిత్ర రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Smiling Face Sky: అరుదైన ఖగోళ దృశ్యం.. చంద్రునికి దగ్గరగా శుక్ర-శని గ్రహాలు.. ఆకాశంలో స్మైలీ

జార్ఖండ్‌లో కర్ణిసేన రాష్ట్ర అధ్యక్షుడు అనుమానాస్పద మృతి!!

మాజీ డీజీపీ భర్తను లేపేసిన భార్య.. ఐ హ్వావ్ ఫినిష్డ్ మాన్‌స్టర్ మెసేజ్!

Skull Discovered on Mars: అంగారక గ్రహంపై మానవ పుర్రె లాంటి రాయి

ఒకే ఆలయం.. ఒకే బావి.. ఒకే శ్మశానవాటిక : మోహన్ భగవత్ పిలుపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments