Webdunia - Bharat's app for daily news and videos

Install App

"నేనే మొదలు పెట్టాను .. నేనే పూర్తి చేస్తాను" ఐరా ట్రైలర్ (Video)

Webdunia
గురువారం, 21 మార్చి 2019 (11:36 IST)
తమిళనాట నయనతార చేసిన సస్పెన్స్‌తో కూడిన హారర్ థ్రిల్లర్ సినిమాలు అక్కడ భారీ విజయాలను సాధిస్తూ ఉంటాయి. అయితే... ఆ సినిమాలు తెలుగు ప్రేక్షకులను సైతం ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలా మరో హారర్ థ్రిల్లర్ సినిమాతో అటు తమిళ ప్రేక్షకులను... ఇటు తెలుగు ఆడియన్స్‌ను పలకరించడానికి నయనతార సిద్ధమైంది. ఆమె ప్రధాన పాత్రధారిగా చేసిన ఆ సినిమానే 'ఐరా'. 
 
తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక ట్రైలర్‌ని విడుదల చేసారు. దెయ్యాలు ఉన్నాయని నమ్మించడానికి ప్రయత్నించిన నయనతార .. ఎలాంటి ఇబ్బందుల్లో పడిందనే కథాంశంతో ఈ కథ కొనసాగుతుందని ఈ ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. 
 
"ఈ లోకంలో ఎవరూ ఇవ్వని సంతోషాన్ని నువ్వు నాకు ఇచ్చావు అభీ.. దానిని దూరం చేసిన ఎవరినీ నేను ప్రాణాలతో వదలను".. "నేనే మొదలు పెట్టాను .. నేనే పూర్తి చేస్తాను" వంటి డైలాగ్స్ సినిమాపై ఉత్కంఠతను పెంచుతున్నాయి. నయనతార ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా తమిళంతోపాటు తెలుగులోనూ ఈ నెల 28వ తేదీన విడుదల కానుంది. ద్విభాషాచిత్రంగా విడుదల అవుతున్న ఈ సినిమా ఏ మేరకు విజయం సాధిస్తుందో చూద్దాం మరి..
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

డెలివరీ బాయ్ గలీజు పనిచేశాడు... లిఫ్టులో మూత్ర విసర్జన

మెస్‌‌లో వడ్డించే అన్నంలో పురుగులు.. ఆంధ్రా వర్శిటీ విద్యార్థుల నిరసన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments