Webdunia - Bharat's app for daily news and videos

Install App

నందమూరి బాలయ్యతో మళ్లీ జతకడుతున్న నయనతార

ఇదివరకు ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’ చిత్రాల్లో జోడీ కట్టిన నందమూరి బాలకృష్ణ, నయనతార ముచ్చటగా మూడోసారి జంటగా ప్రేక్షకులకు కనువిందు చేయనున్నారు. ఈ సారి కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకత్వం వహించే సినిమాలో కలిసి నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని ఆ చిత్ర న

Webdunia
శుక్రవారం, 23 జూన్ 2017 (06:59 IST)
ఇదివరకు ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’ చిత్రాల్లో జోడీ కట్టిన నందమూరి బాలకృష్ణ, నయనతార ముచ్చటగా మూడోసారి జంటగా ప్రేక్షకులకు కనువిందు చేయనున్నారు. ఈ సారి కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకత్వం వహించే సినిమాలో కలిసి నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాత సి. కల్యాణ్‌ ధ్రువీకరించారు. 
 
‘‘బాలకృష్ణ సరసన ఇద్దరు నాయికలుంటారు. ఒక నాయికగా నయనతారను ఎంపిక చేశాం. కథ వినగానే నాయికగా నటించేందుకు ఆమె అంగీకరించారు. కచ్చితంగా బాలకృష్ణ, నయనతార జోడీ మరోసారి ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఈ నెలాఖరున లాంఛనంగా షూటింగ్‌ ప్రారంభించి, జూలై నెలాఖరు నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్తాం’’ అని ఆయన చెప్పారు. 
 
ఫ్యాక్షన్‌ నేపథ్యంలో నడిచే ఈ కథలో కె.ఎస్‌. రవికుమార్‌ శైలి వినోదంతో పాటు, సెంటిమెంట్‌, యాక్షన్‌, ఫ్యామిలీ డ్రామా అంశాలు ప్రధానంగా ఉంటాయి. తొలి షెడ్యూల్‌ను తమిళనాడులోని కుంభకోణంలో నిర్వహిస్తారు. 2018 సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయాలనేది నిర్మాత సంకల్పం. 
 
ఎం.రత్నం సంభాషణలు రాస్తున్న ఈ చిత్రానికి ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఫేమ్‌ చిరంతన్‌ భట్‌ సంగీతం అందిస్తుండగా, శ్యామ్‌ కె. నాయుడు ఛాయాగ్రాహకునిగా పనిచేస్తున్నారు. బాలకృష్ణతో మరో చిత్రంలో నటించడానికి నయనతార ఇటీవల తిరస్కరించినట్లు వార్తలు వచ్చిన నేపధ్యంలో ఈ ఇద్దరూల మరోసారి జోడీ కడుతుండటం బాలయ్య అభిమానులను సంతోషపెడుతోంది.
 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments