Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైంధవ్ నుంచి వికాస్ మాలిక్ గా నవాజుద్దీన్ సిద్ధిఖీ పరిచయం

Webdunia
శుక్రవారం, 19 మే 2023 (19:07 IST)
Nawazuddin Siddiqui
విక్టరీ వెంకటేష్ 75వ లాండ్ మార్క్ మూవీ 'సైంధవ్' కు టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. హై-ఆక్టేన్ యాక్షన్‌ ఎంటర్ ట్రైనర్ రూపొందుతున్న ఈ చిత్రంలో  ప్రముఖ తారాగణం కనిపిస్తోంది. ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది.
 
బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. ఈ రోజు నవాజుద్దీన్ సిద్ధిఖీ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ చిత్రంలో ఆయన ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు మేకర్స్. వికాస్ మాలిక్ గా నవాజుద్దీన్ సిద్ధిఖీ ని పరిచయం చేశారు. ఒక కాస్ట్లీ కార్ పై కూర్చుని బీడీ తాగుతూ కనిపించారు. గెటప్ లో క్లాస్‌ గా కనిపిస్తూనే సినిమాలో డెడ్లీ విలన్‌ గా నటిస్తున్నారు.
 
మనోజ్ఞ పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుండగా, డాక్టర్ రేణు పాత్రలో రుహాని శర్మ, జాస్మిన్ పాత్రలో ఆండ్రియా జెర్మియా కనిపించనున్నారు.
 
ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఎస్ మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్  గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత.
 
సైంధవ్ పాన్ ఇండియా చిత్రంగా అన్ని దక్షిణాది భాషలు, హిందీలో డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విమానంలో విషపూరిత పాములు... వణికిపోయిన ప్రయాణికులు

స్పేస్ ఎక్స్ విమానంలో భూమికి తిరిగిరానున్న సునీత-విల్మోర్‌

చెవిరెడ్డి కూడా నాకు చెప్పేవాడా? నేను వ్యక్తిగత విమర్శలు చేస్తే తట్టుకోలేరు: బాలినేని కామెంట్స్

మా ఇల్లు బఫర్‍‌జోన్‌లో ఉందా... హైడ్రా కమిషనర్ క్లారిటీ!!

శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరుదైన విదేశీ పాములు.. ఎలా వచ్చాయంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments