Webdunia - Bharat's app for daily news and videos

Install App

విషమంగా 'యమదొంగ' చిత్రంలో రంభ పాత్రధారి ఆరోగ్యం

Webdunia
సోమవారం, 17 ఆగస్టు 2020 (15:37 IST)
జూనియర్ ఎన్టీఆర్ - ఎస్ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "యమదొంగ". ఈ చిత్రంలో 'యంగ్ యమ.. యంగ్ యమ' అనే ప్రత్యేక పాట ఉంది. ఇందులో రంభగా నటించిన హీరోయిన్ నవనీత్ కౌర్. ఈమె ప్రస్తుతం కరోనా వైరస్ బారినపడి ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. 
 
నవనీత్ కౌర్ కుటుంబంలో ఏకంగా 12 మందికి ఈ వైరస్ సోకింది. వీరికి సేవలు చేసే క్రమంలో నవనీత్ కౌర్‌కు కూడా ఈ వైరస్ అంటుకుంది. దీంతో వెంటనే ఆమె చికిత్స కోసం అమరావతి దవాఖానలో చేరారు. అయితే ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ ఉండ‌డంతో నాగ్‌పూర్‌లోని ఓఖార్డ్ హాస్పిటల్‌లో చేరారు.
 
కానీ, ఆమె ఆరోగ్యంలో ఎలాంటి మార్పురాలేదు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈమెను ముంబై ఆసుపత్రికి తరలించి చికిత్స  అందిస్తున్న‌ట్టు తెలుస్తుంది. న‌వ‌నీత్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆమె అభిమానులు ప్రార్థిస్తున్నారు. 
 
ప్రస్తుతం ఈమె కుటుంబానికి చెందిన భర్త, పిల్లలతో పాటు.. మొత్తం 12 మంది కరోనా వైరస్ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తెలుగు చిత్రపరిశ్రమలో అనేక చిత్రాల్లో నటించిన నవనీత్ కౌర్... పెళ్లి చేసుకున్న తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి మహారాష్ట్రలోని అమరావతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా కొనసాగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జమిలి బిల్లు: భారత రాజ్యాంగాన్ని బలహీనపరుస్తోంది.. వైఎస్ షర్మిల

ఆస్తి కోసం అన్నదమ్ములను చంపేసిన చెల్లి!!

జేపీసీకి జమిలి బిల్లు... కమిటీలో ప్రియాంకా గాంధీ!!

ఆప్ మరో కీలక హామీ : ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత వైద్యు

భారత్‌కు పన్నుపోటు తప్పదు : హెచ్చరించిన డోనాల్డ్ ట్రంప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

తర్వాతి కథనం
Show comments