Webdunia - Bharat's app for daily news and videos

Install App

భావోద్వేగాలకు అవార్డుల పంట.. గాల్లో తేలుతున్న 'శతమానంభవతి' దర్శకుడు

తెలుగు సినిమా ఇప్పుడు ఎమోషన్ల దారి పట్టింది. అది ఎంత కళాత్మకంగా తెరకెక్కుతోందంటే వరుసగా ప్రతి సంవత్సరం ఎమోషన్లను పీక్‌కి తీసుకుపోయిన చిత్రాలకే జాతీయ అవార్డుల పంట పండుతోంది. ఈ సంవత్సరం సంక్రాంతికి పెద్ద సినిమాల నడుమనే విడుదలైన శతమానంభవతి సినిమాకు జాతీ

Webdunia
శనివారం, 8 ఏప్రియల్ 2017 (04:15 IST)
తెలుగు సినిమా ఇప్పుడు ఎమోషన్ల దారి పట్టింది. అది ఎంత కళాత్మకంగా తెరకెక్కుతోందంటే వరుసగా ప్రతి సంవత్సరం ఎమోషన్లను పీక్‌కి తీసుకుపోయిన చిత్రాలకే జాతీయ అవార్డుల పంట పండుతోంది. ఈ సంవత్సరం సంక్రాంతికి పెద్ద సినిమాల నడుమనే విడుదలైన శతమానంభవతి సినిమాకు జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ఎంపికై సంచలనం గొలిపించింది. చిత్ర దర్శకుడే తన సినిమాకు అవార్డు వచ్చిందని తెలిసినప్పుడు కలా నిజమా అనిపించేంత ఆశ్చర్యానికి గురవడం విశేషం.


 
64వ జాతీయ చలనచిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. దిల్‌ రాజు నిర్మాతగా సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. పెద్దగా అంచనాలు లేకుండా రెండు పెద్ద సినిమాల మధ్య విడుదలై అపూర్వ ప్రజాదరణను నోచుకున్న తన సినిమా జాతీయస్థాయిలో ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ఎంపిక కావడంపై ఆ చిత్ర దర్శకుడు సతీష్‌ వేగ్నేశ సంతోషం వ్యక్తం చేశారు. 
 
"శతమానం భవతి చిత్రానికి అవార్డు వచ్చినట్లు మా ప్రొడక్షన్‌ టీమ్‌ నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. అయితే వాళ్లు జోక్‌ చేశారనుకున్నారు. ఈ సినిమాకు అవార్డు వస్తుందని అస్సలు ఊహించలేదు. అందుకే ఇది నిజంగా సర్‌ఫ్రైజే. ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన నిర్మాతకు థ్యాంక్స్‌ చెప్పాలి’  అంటూ చిత్రదర్శకుడు దర్శకుడు సతీష్‌ వేగ్నేశ్ వార్తవినగానే పొంగిపోయారు.
 
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన  'శతమానం భవతి'  బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ కొట్టడమే కాకుండా మంచి వసూళ్లు రాబట్టింది. శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, జయసుధలు ప్రధాన తారాగణంగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు  నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments