Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజేశ్‌ ఖన్నా ఓ చెత్త నటుడు.. ఆయన వల్లే బాలీవుడ్ ఇలా దాపురించింది : నటుడు నసీరుద్దీన్‌షా

బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటుల్లో ఒకరైన రాజేశ్ ఖన్నా ఓ చెత్త నటుడు అని ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Webdunia
సోమవారం, 25 జులై 2016 (13:32 IST)
బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటుల్లో ఒకరైన రాజేశ్ ఖన్నా ఓ చెత్త నటుడు అని ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. పైగా ఆయన వల్లే బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఇలా దాపురించిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిజానికి రాజశేఖన్నా 70వ దశకంలో యువతను ఉర్రూతలూగించిన సూపర్‌స్టార్. అయితే, ఆయనపై నసీరుద్దీన్ షా విమర్శలు సంధించారు. 
 
1970లో హిందీ చిత్ర పరిశ్రమలో అతి సామాన్యమైన సాంకేతిక విలువలను ప్రవేశపెట్టడానికి రాజేశ్‌ఖన్నానే కారణం అని ఆరోపించారు. కథలు 70లో ఎలా ఉన్నాయో.. ఇప్పుడూ అలానే ఉన్నాయి అని ఆయన అన్నారు. రాజేశ్‌ ఖన్నా పరిశ్రమలోకి ప్రవేశించినప్పుడు అంటే 70 దశకంలోనే సినీ రంగానికి ఈ జాఢ్యం పట్టుకుందన్నారు. పరిమితమైన సామర్థ్యం ఉన్న నటుడు. వాస్తవానికి అతనో చెత్త యాక్టర్. ఎలాంటి లక్ష్యం లేకుండా కనిపించే అలాంటి వ్యక్తిని నా జీవితంలో ఇప్పటివరకు కలుసుకోలేదు అని నసీరుద్దీన్ అన్నారు. 
 
ఆయన కాలంలోనే కథ, నటన, సంగీతం, సాహిత్య విభాగాలు భ్రష్టుపట్టాయని అన్నారు. ఆ రోజుల్లో కథకు అసలు ప్రాధాన్యమే లేదని, హీరోయిన్ ఉందా రంగు డ్రస్ వేసుకొని, హీరో ఎరుపు రంగు చొక్కా వేసుకొనేవారని. కాశ్మీర్‌కు వెళ్లి సినిమా తీసొచ్చేవారని ఎద్దేవా చేశారు. రాజేశ్‌ ఖన్నా అభిరుచి పరిశ్రమను శాసించడం, ప్రేక్షకులకు ఆయనో దేవుడిగా కనిపించడం వల్ల అలాంటి పరిస్థితి నెలకొని ఉందని అన్నారు.
 
కాగా, నసీరుద్దీన్ వ్యాఖ్యలపై రాజేశ్‌ఖన్నా కూతురు, నటి ట్వింకిల్ ఖన్నా మండిపడ్డారు. బతికి ఉన్న వారిని గౌరవించకపోయినా ఫర్వాలేదు గానీ కనీసం చనిపోయిన వారినైనా గౌరవించండి అని ట్వింకిల్ ట్వీట్ చేశారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments