Webdunia - Bharat's app for daily news and videos

Install App

సారీ పవర్‌స్టార్ ఫ్యాన్స్ అంటూ.. నరుడా డోనరుడా హీరో సుమంత్ ఎందుకు చెప్పాడు?

సుమంత్ హీరోగా న‌టించిన న‌రుడా డోన‌రుడా సినిమా శుక్రవారం రిలీజైంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. తనికెళ్ల భరణి, సుమంత్ యాక్టింగ్‌తో పాటు సినిమా కాన్సెప్ట్ విభిన్నంగా ఉండటంతో ప్రేక్షకులు సినిమాను

Webdunia
శుక్రవారం, 4 నవంబరు 2016 (17:09 IST)
సుమంత్ హీరోగా న‌టించిన న‌రుడా డోన‌రుడా సినిమా శుక్రవారం రిలీజైంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. తనికెళ్ల భరణి, సుమంత్ యాక్టింగ్‌తో పాటు సినిమా కాన్సెప్ట్ విభిన్నంగా ఉండటంతో ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్నారు. ఈ సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా సుమంత్ సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో లైవ్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చాడు. 
 
‘మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు’ అని ఓ అభిమాని ప్రశ్నించగా.. అందుకు సుమంత్ ఏమని సమాధానం ఇచ్చాడంటే.. ‘నేను అందరి పెళ్లిల్లకు వెళ్తా గానీ, నా పెళ్లికి మాత్రం వెళ్లను’ అని తుంటరిగా చెప్పాడు. అలాగే మరో అభిమాని ‘మీ అభిమాన నటుడెవరు’ అని అడిగాడు. ‘నా ఫేవరెట్‌ హీరో మహేష్‌బాబు.. సారీ పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌’ అని తడుముకోకుండా చెప్పేశాడు. 
 
ఇదిలా ఉంటే.. ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ జీవన పోరాటం చేస్తున్న నిస్సహాయుల కోసం టాలీవుడ్ స్టార్స్, జెమినీ టీవీ ‘మేము సైతం’ కార్యక్రమం నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో నేను సైతం అంటూ సుమంత్ ముందుకొచ్చాడు.

నిరుపేదలైన తల్లీకూతుళ్ల కోసం నిరుపేద తల్లీకూతుళ్లకు అండగా హీరో సుమంత్ ఐస్‌క్రీమ్స్ అమ్మారు. నిస్సహాయ తల్లీకూతుళ్లను ఆదుకోవడానికి సుమంత్ చేసిన వినూత్న సేవతో ‘మేము సైతం’ కార్యక్రమం ఈ శనివారం రాత్రి 9:30 ని.లకు జెమినీ టీవీలో ప్రసారం కానుంది. ఇలా సుమంత్ ఐస్ క్రీమ్స్ అమ్మడం ద్వారా వచ్చిన మొత్తాన్ని నిరుపేద కుటుంబానికి చేరుతుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments