Webdunia - Bharat's app for daily news and videos

Install App

"కథలో రాజకుమారి" కోసం రఫ్ లుక్‌తో రోహిత్

వైవిధ్యమైన కథలను ఎంచుకొంటూ యువ కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న నారా రోహిత్ నటిస్తున్న తాజా చిత్రం "కథలో రాజకుమారి". శ్రీహాస్ ఎంటర్‌టైన్మెంట్స్ మరియు అరణ్ మీడియా వర్క్స్ సంస్థల

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (19:58 IST)
వైవిధ్యమైన కథలను ఎంచుకొంటూ యువ కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న నారా రోహిత్ నటిస్తున్న తాజా చిత్రం "కథలో రాజకుమారి". శ్రీహాస్ ఎంటర్‌టైన్మెంట్స్ మరియు అరణ్ మీడియా వర్క్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు మోషన్ పోస్టర్‌ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా నేడు (ఫిబ్రవరి 14) విడుదల చేశారు. మహేష్ సూరపనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రశాంతి, సౌందర్య నర్రా, కృష్ణ విజయ్ నిర్మాతలు. నారా రోహిత్ తోపాటు నాగశౌర్య మరో ముఖ్యపాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్ కీలకపాత్రధారి. 
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ""జ్యో అచ్యుతానంద" అనంతరం నారా రోహిత్-నాగశౌర్యలు కలిసి నటిస్తున్న సినిమా ఇది. నారా రోహిత్ రఫ్ లుక్‌తో విడుదల చేసిన పోస్టర్, మోషన్ పోస్టర్‌కి మంచి స్పందన లభిస్తోంది. నారా రోహిత్ చాలా వైవిధ్యమైన క్యారెక్టరైజేషన్‌లో ఈ సినిమాలో కనిపించనున్నారు. షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయ్యింది, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. 
 
ఆడియో, ట్రైలర్ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. అతి త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. మహేష్ సూరపనేని ఈ చిత్రంలో రోహిత్ వేషధారణను తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకులను ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. అలాగే ఆయన "కథలో రాజకుమారి" చిత్రాన్ని తెరకెక్కించిన విధానం కూడా సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది" అన్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments