Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పీడ్‌ పెంచినా.. రోహిత్‌కు ఫలితం దక్కేనా!

నారా వంశం నుంచి సినిమా వారసుడుగా వచ్చిన నారా రోహిత్‌.. ఎడాపెడా సినిమాలు చేసేస్తున్నాడు. హీరోగా బాణం ఎక్కుపెట్టి.. తుంటరి.. రౌడీఫెలో.. రాజా చేయివేస్తే.. అంటూ.. చేసినా.. పెద్దగా ఫలితం ఇవ్వలేదు. కానీ వరుస సినిమాలు చేస్తున్న.. రోహిత్‌.. ఏడాదిన్నర ముందు '

Webdunia
బుధవారం, 6 జులై 2016 (19:07 IST)
నారా వంశం నుంచి సినిమా వారసుడుగా వచ్చిన నారా రోహిత్‌.. ఎడాపెడా సినిమాలు చేసేస్తున్నాడు. హీరోగా బాణం ఎక్కుపెట్టి.. తుంటరి.. రౌడీఫెలో.. రాజా చేయివేస్తే.. అంటూ.. చేసినా.. పెద్దగా ఫలితం ఇవ్వలేదు. కానీ వరుస సినిమాలు చేస్తున్న.. రోహిత్‌.. ఏడాదిన్నర ముందు 'శంకర' అని చేశాడు. ఆ చిత్రం కొన్ని కారణాల వల్ల విడుదల కాలేదు. అయితే ప్రస్తుతం దాన్ని విడుదల చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. 
 
ఎందుకంటే.. తమిళంలో హిట్టయిన మౌనగురు చిత్రానికి రీమేక్‌గా చేశారు. చిత్రం బాగానే వచ్చిందని.. అప్పట్లో దర్శకుడు సత్య వెల్లడించారు. కె.ఎస్‌ .రామారావు దీనికి సమర్పకుడిగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని ఎంత త్వరగా విడుదల చేస్తే అంత బెటర్‌ అని రోహిత్‌ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 27 డేట్‌ను ఫిక్స్‌ చేసినట్లు సమాచారం. లేదంటే.. దర్శకుడు మురుగదాస్‌.. మౌనగురులోని పాయింట్‌ తీసుకుని లేడీ ఓరియెంట్‌ చిత్రంగా మలచడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు సోనాక్షి సిన్హాను ఎంపిక కూడా చేశాడు. సో... ఎలాగైనా.. శంకరను రిలీజ్‌ చేయకపోతే.. చేసిన పని వృధా అవుతుందేమో.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments