'ఎన్టీఆర్ మహానాయకుడు'లో బుల్లి ఎన్టీఆర్‌గా దేవాన్ష్

Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (14:44 IST)
స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా రెండు భాగాలుగా బయోపిక్‌ను తెరకెక్కించారు. ఇందులో తొలి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతికి విడుదలై, బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఇపుడు మహానాయకుడు పేరుతో రెండో భాగం త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. వాస్తవానికి ఈచిత్రం ఈనెల 7వ తేదీనే విడుదల కావాల్సి ఉండగా, వాయిదా వేశారు. ఈ రెండో భాగంలో ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని ముఖ్యంగా చూపించనున్నారు.
 
అయితే, ఇందులో ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రను ఏపీ సీఎం చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ పోషించినట్టు సమాచారం. అదేవిధంగా హీరో నందమూరి కల్యాణ్ రామ్ తనయుడు శౌర్య రామ్ కూడా నటించినట్టు తెలుస్తోంది. దేవాన్ష్‌కి సంబంధించిన షూటింగ్ కూడా కొద్ది రోజుల క్రితం పూర్తయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో వింత వ్యాధి : చిన్నారి శరీరమంతా బొబ్బలే (వీడియో)

#JEEMain2026 షెడ్యూల్ రిలీజ్... జనవరి నెలలో మెయిన్స్ పరీక్షలు

రూ.2 కోట్లు ఎదురు కట్నమిచ్చి 24 యేళ్ల యువతిని పెళ్లాడిన 74 యేళ్ల తాత!!

ఒకే వేదికపై ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్న యువకుడు

ఆ స్వీట్ చాలా కాస్ట్లీ గురూ... స్వర్ణ ప్రసాదం రూ.1.11 లక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments