Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీతో నావల్ల కాదు.. నన్ను రిలీజ్‌ చేసెయ్యండి అంటున్న నాని...

Webdunia
గురువారం, 25 జులై 2019 (22:29 IST)
నేచురల్‌ స్టార్‌ నాని వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకం పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న చిత్రం 'నాని'స్‌ గ్యాంగ్‌ లీడర్‌'. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను జూలై 24 ఉదయం 11 గంటలకు విడుదల చేశారు. స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు ఫన్నీగా సాగే డైలాగ్స్‌తో ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా ఉంది టీజర్‌. 'ఎస్‌.. ఎస్‌.. ఐ యామ్‌ ద పెన్సిల్‌.. ఫేమస్‌ రివెంజ్‌ రైటర్‌.. పెన్సిల్‌ పార్థసారథి' అంటూ తనని తాను ఇంట్రడ్యూస్‌ చేసుకోవడంతో టీజర్‌ మొదలవుతుంది.
 
ఆ తర్వాత తన గ్యాంగ్‌ని పరిచయం చేస్తూ 'ఈరోజు ఇంటికి ఐదుగురు లేడీస్‌ వచ్చారు. వాళ్ళ ఏజ్‌లు, గెటప్‌లు చూస్తుంటే పుట్టుక నుంచి చావు దాకా ఒక కంప్లీట్‌ లైఫ్‌ సైకిల్‌ని చూస్తున్నట్టనిపించింది. భలే ఉన్నార్లే' అంటూ నాని చెప్పే డైలాగ్స్‌ ఆయా క్యారెక్టర్ల పై క్యూరియాసిటీని పెంచేలా ఉన్నాయి. ఆ తర్వాత ఆ గ్యాంగ్‌, నాని కలిసి చేసిన కొన్ని సీన్స్‌ నవ్వు తెప్పిస్తాయి. ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న కార్తికేయ కూడా టీజర్‌లో కనిపిస్తారు. 'మీతో నావల్ల కాదు.. నా వల్ల కాదు.. నన్ను రిలీజ్‌ చేసెయ్యండి' అంటూ నాని చెప్పే డైలాగ్‌తో టీజర్‌ కంప్లీట్‌ అవుతుంది.
 
ఈ టీజర్‌ రిలీజ్‌ అయిన కొద్ది నిముషాల్లోనే లక్షల వ్యూస్‌ని సాధిస్తూ అద్భుతమైన రెస్పాన్స్‌ అందుకుంటోంది. ఒక డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందిందని టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. ఈ టీజర్‌లోని ప్రతి షాట్‌ సినిమాపై అంచనాలు భారీగా పెంచేలా ఉంది. కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాతో తప్పకుండా నాని తన ఖాతాలో మరో సూపర్‌హిట్‌ని వేసుకోవడం ఖాయం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యం కిక్కుతో విద్యుత్ తీగలపై హాయిగా పడుకున్న తాగుబోతు (video)

కొత్త సంవత్సరం రోజున ప్రజలకు చేరువగా గడిపిన సీఎం బాబు... ఏకంగా 2 వేల మందితో ఫోటోలు..

తొక్కిసలాట ఘటనపై వివరణ ఇవ్వండి.. టీ డీజీపీకి ఎన్.హెచ్.ఆర్.సి నోటీసులు

సమస్యకు ఉంటే ప్రజలు మా వద్దకు వస్తారు... ఓట్ల వద్దకు వచ్చేసరికి : రాజ్‌ఠాక్రే

సంక్రాంతి స్పెషల్ రైళ్లు - రేపటి నుంచి బుక్కింగ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments