Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపటినుంచి రెగ్యులర్ షూటింగ్ లో నాని 30వ సినిమా

Webdunia
మంగళవారం, 31 జనవరి 2023 (15:07 IST)
Clap by chiranjeevi
నేచురల్ స్టార్ నాని 30వ చిత్రానికి నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహించనున్నారు. మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కెఎస్  ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై భారీ ఎత్తున, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మించనున్నారు. ఈ సినిమా ఈరోజు హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైంది.
 
ముహూర్తం షాట్‌కు మెగాస్టార్ చిరంజీవి క్లాప్‌ కొట్టగా..  అశ్వినీదత్ కెమెరా స్విచాన్ చేశారు. బుచ్చిబాబు, కిషోర్ తిరుమల, హను రాఘవపూడి, వశిష్ట, వివేక్ ఆత్రేయ కలిసి తొలి షాట్‌కి దర్శకత్వం వహించారు. అంతకుముందు విజయేంద్ర ప్రసాద్  ప్రొసీడింగ్స్ ప్రారంభించడానికి మేకర్స్‌కి స్క్రిప్ట్‌ను అందజేశారు. పలాస కరుణ్ కుమార్, గిరీష్ అయ్యర్, దేవకట్టా, చోటా కె నాయుడు, సురేష్ బాబు, దిల్ రాజు, 14 రీల్స్ గోపి- రామ్ ఆచంట, ఎకె అనిల్ సుంకర, మైత్రి రవి, డివివి దానయ్య, స్రవంతి రవి కిషోర్, కెఎస్ రామారావు, సాహు గారపాటి, ఏషియన్ సునీల్, అభిషేక్ అగర్వాల్, నిహారిక కొణిదెల, కళ్యాణ్ దాసరి తదితరులు ఈ ప్రారంభోత్సవ వేడుకకు అతిథులుగా హాజరయ్యారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రేపు హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది.
 
మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో నానికి జోడిగా నటించనున్నారు. ఈ చిత్రంలో కొంతమంది ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. సాను జాన్ వర్గీస్ ISC డీవోపీగా, హృదయం ఫేమ్‌ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందించనున్నారు.
 
ప్రవీణ్ ఆంథోని ఎడిటర్ గా, జోతిష్ శంకర్ ప్రొడక్షన్ డిజైనర్ గా,  సతీష్ ఈవీవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా  పని చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం
Show comments