Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిల్ రాజు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న నాని, ఆలోచనలో పడ్డ దిల్ రాజు

Webdunia
శనివారం, 18 జులై 2020 (14:55 IST)
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో నేచురల్ స్టార్ నానితో నిర్మించిన చిత్రం వి. ఈ చిత్రంలో నాని, సుధీర్ బాబు నటించారు. విభిన్న కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ మూవీని ఎనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీనికితోడు టీజర్ అండ్ ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై మరింత ఆసక్తి ఏర్పడింది.
 
అయితే.. ఈ మూవీని ఉగాది కానుకగా రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కరోనా కారణంగా ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. అయితే... ఈ సినిమాకి ఓటీటీ సంస్థలు భారీ ఆఫర్స్ ఇస్తున్నాయని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. దిల్ రాజు మాత్రం ఈ చిత్రాన్ని ధియేటర్లోనే రిలీజ్ చేస్తామని చెప్పారట.
 
దీనికి కారణం ఏంటంటే... వి సినిమాని ఓటీటీ సంస్థలో రిలీజ్ చేయడానికి హీరో నాని, డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ ఒప్పుకోవడం లేదట. ఈ సినిమాని థియేటర్లో రిలీజ్ చేయడం కోసం చేసాం. థియేటర్లో చూస్తేనే థ్రిల్ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోను వి సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయద్దు అని నిర్మాత దిల్ రాజుకు చెప్పారట.
 
 అవసరం అయితే... రెమ్యూనరేషన్‌లో తగ్గించుకోండి కానీ... వి సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయద్దని నాని గట్టిగా చెప్పాడని.. అందుకే దిల్ రాజు వి సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయాలని ఉన్నా... చేయడం లేదని టాలీవుడ్ టాక్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments