Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాని, మృణాల్ ఠాకూర్ హాయ్ నాన్న థర్డ్ సింగిల్ రాబోతుంది

Webdunia
సోమవారం, 30 అక్టోబరు 2023 (14:42 IST)
Nani- mrunal
నాని యూనిక్, హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘హాయ్ నాన్నా’ తో ప్రేక్షకులని అలరించబోతున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రం గ్లింప్స్, టీజర్ కు నేషనల్ వైడ్ గా అద్భుతమైన స్పందన వచ్చింది. మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా చార్ట్ బస్టర్ నోట్ లో స్టార్ట్ అయ్యాయి. మొదటి రెండు పాటలు సూపర్ హిట్స్ గా నిలిచింది. ఫస్ట్ సింగిల్ సమయమా పాటలో నాని, మృణాల్ ఠాకూర్  మధ్య ప్రేమ, బాండింగ్ ని అద్భుతంగా చూపించారు. రెండో పాట గాజు బొమ్మ తండ్రి, కూతురు పంచుకునే అందమైన అనుబంధాన్ని మనసుని హత్తుకునేలా చిత్రీకరించారు.
 
తాజాగా ‘హాయ్ నాన్నా’ మేకర్స్ థర్డ్ సింగిల్ అప్డేట్ తో వచ్చారు. థర్డ్ సింగిల్ అమ్మాడి పాటని నవంబర్ 4న విడుదల చేయనున్నారు. సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో నాని, మృణాల్ ఠాకూర్ లవ్లీ కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. పోస్టర్ బట్టి చూస్తుంటే అమ్మాడి పాట బ్యూటీఫుల్ రొమాంటిక్ నెంబర్ అని అర్ధమౌతోంది. సూపర్ ఫామ్ లో వున్న కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించబోతున్న మరో చార్ట్ బస్టర్ సాంగ్ కోసం ప్రేక్షకులు ఎక్సయిటింగ్ గా ఎదురుచుస్తున్నారు.  
 
శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుండగా, బేబీ కియారా ఖన్నా నాని కుమార్తెగా కనిపించనుంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించారు.
 
ఈ చిత్రానికి సాను జాన్ వరుగీస్ ISC సినిమాటోగ్రాఫర్. ప్రవీణ్ ఆంథోని ఎడిటర్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. సతీష్ ఈవీవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.
 
‘హాయ్ నాన్నా’ ఈ ఏడాది డిసెంబర్ 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments