Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాని, మృణాల్ ఠాకూర్ ఫస్ట్ లుక్, గ్లింప్స్ రాబోతుంది

Webdunia
బుధవారం, 12 జులై 2023 (12:43 IST)
Nani 30 poster
నేచురల్ స్టార్ నాని ల్యాండ్‌మార్క్ మూవీ #Nani30 నూతన దర్శకుడు శౌర్యువ్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో భారీ స్థాయి తెరకెక్కుతోంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాని కొన్ని ఎక్సోటిక్ లొకేషన్స్‌లో చిత్రీకరిస్తున్నారు. ఇందులో నాని డిఫరెంట్ లుక్, క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో కథానాయిక.
 
మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ లుక్,  గ్లింప్స్‌కి సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చారు. #Nani30 ఫస్ట్ లుక్,  గ్లింప్స్‌ జూలై 13న విడుదల కానుంది. అనౌన్స్ మెంట్ వీడియో లో నాని పారాగ్లైడింగ్ చేస్తూ కనిపించారు. సినిమా కోసం నాని ఎలాంటి రిస్క్ తీసుకున్నారో ఇది స్పష్టంగా సూచిస్తుంది. మరొక వీడియోలో మృనాల్ ఠాకూర్ ఇదే అనౌన్స్ మెంట్ చేస్తూ "ప్రవహించే సముద్రంలా, ప్రేమ మమ్మల్ని చుట్టుముట్టింది, మిమ్మల్ని చేరుకుంటుంది." అని కోట్ చేశారు.
 
వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తుండగా, కోటి పరుచూరి సిఒఒగా వ్యవహరిస్తున్నారు.
 
ఈ చిత్రంలో సాను జాన్ వర్గీస్ ISC డీవోపీగా, హృదయం ఫేమ్‌ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రవీణ్ ఆంథోని ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా, సతీష్ ఈవీవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా  పని చేస్తున్నారు.  
 
యూనిక్ స్టొరీ లైన్ తో పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments