అల్లరి నరేష్ ఉగ్రం నుంచి ఫామిలీ సాంగ్ లాంచ్ చేసిన హీరో నాని

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2023 (16:22 IST)
naresh, mirna
విజయ్ కనకమేడల, షైన్ స్క్రీన్స్ ‘ఉగ్రం’ నుంచి సెకండ్  సింగిల్ ‘అల్బెలా అల్బెలా’ పాటను నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. మొదటి పాట దేవేరి బ్లాక్‌బస్టర్‌ కాగ, ఉగ్రం సెకండ్ సింగిల్ ఇప్పుడు విడుదలైంది. అల్బెలా అల్బెలా పాటను నేచురల్ స్టార్ నాని లాంచ్ చేశారు. శ్రీచరణ్ పాకాల పెప్పీ బీట్స్‌తో ప్లజంట్ సాంగ్ ని అందించారు. కుటుంబంతో గడపడం ఎంత ముఖ్యమో ఈ పాట చెబుతుంది.
 
పోలీసు పాత్రలో నటించిన అల్లరి నరేష్ తన భార్య మిర్నా, కూతురితో హాయిగా గడపడానికి పని నుండి బ్రేక్  తీసుకున్నారు. ఈ విషయాన్ని భాస్కరభట్ల పాట ద్వారా తెలియజేశారు. రేవంత్, శ్రావణ భార్గవి బ్యూటీఫుల్ గా ఆలాపించారు. విజువల్స్ మరింత ఆహ్లాదకరంగా ఉన్నాయి. మనం కూడా విశ్రాంతి తీసుకొని కుటుంబంతో గడిపిన అనుభూతిని పొందుతాము. ఇది మరో చార్ట్‌బస్టర్  కానుంది.
 
యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘ఉగ్రం’ను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది గ్రాండ్‌గా నిర్మించారు. తూమ్ వెంకట్ కథ అందించగా, అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు.
వేసవి కానుకగా మే 5న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో వింత వ్యాధి : చిన్నారి శరీరమంతా బొబ్బలే (వీడియో)

#JEEMain2026 షెడ్యూల్ రిలీజ్... జనవరి నెలలో మెయిన్స్ పరీక్షలు

రూ.2 కోట్లు ఎదురు కట్నమిచ్చి 24 యేళ్ల యువతిని పెళ్లాడిన 74 యేళ్ల తాత!!

ఒకే వేదికపై ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్న యువకుడు

ఆ స్వీట్ చాలా కాస్ట్లీ గురూ... స్వర్ణ ప్రసాదం రూ.1.11 లక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments