Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాని, మృణాల్ ఠాకూర్ నటిస్తున్న హాయ్ నాన్న మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ

Webdunia
గురువారం, 14 సెప్టెంబరు 2023 (13:51 IST)
Nani,
నేచురల్ స్టార్ నాని పాన్ ఇండియా చిత్రం ‘హాయ్ నాన్నా’ మ్యూజికల్ ప్రమోషన్స్ గ్రాండ్ గా ప్రారంభం కానున్నాయి. ఈరోజు ఈ సినిమాలోని మొదటి పాట సమయమా విడుదల చేసే తేదీని మేకర్స్ అనౌన్స్ చేశారు. సమయమా పాట సెప్టెంబర్ 16న విడుదల కానుంది. పోస్టర్ లో నాని చిరునవ్వుతో తన చేతులను విప్పి  అనందంగా కనిపిస్తున్నారు. పోస్టర్ సూచించినట్లుగా, సమయమా పాట అందమైన, మ్యాజికల్ మెలోడీ. 
 
నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానిన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుండగా, బేబీ కియారా ఖన్నా ఈ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో కీలక పాత్రలో కనిపించనుంది.
 
గ్లింప్స్ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. ఇటీవలి నాని సినిమాల మాదిరిగానే ‘హాయ్ నాన్న’ చార్ట్‌బస్టర్ ఆల్బమ్ గా వుంటుంది.
 
ఈ చిత్రానికి సాను జాన్ వరుగీస్ ISC సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. ప్రవీణ్ ఆంథోని ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా, సతీష్ ఈవీవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు.  
 
'హాయ్ నాన్న' ఈ ఏడాది డిసెంబర్ 21న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments