Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘విశ్వామిత్ర’లో నందితా

‘గీతాంజలి, త్రిపుర’ వంటి సక్సెస్ ఫుల్ లేడీ ఓరియంటెడ్ మూవీస్ తెరకెక్కించిన రాజ కిరణ్ ప్రస్తుతం మరో లేడీ ఓరియంటెడ్ మూవీ తెరకెక్కిస్తున్నారు. 'విశ్వామిత్ర' టైటిల్‌తో మాధవి అద్దంకి, రజనీకాంత్‌ యస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం గత నెల ప్రారంభమైన విషయం తెలిసిందే

Webdunia
శనివారం, 30 జూన్ 2018 (19:28 IST)
‘గీతాంజలి, త్రిపుర’ వంటి సక్సెస్ ఫుల్ లేడీ ఓరియంటెడ్ మూవీస్ తెరకెక్కించిన రాజ కిరణ్ ప్రస్తుతం మరో లేడీ ఓరియంటెడ్ మూవీ తెరకెక్కిస్తున్నారు. 'విశ్వామిత్ర' టైటిల్‌తో మాధవి అద్దంకి, రజనీకాంత్‌ యస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం గత నెల ప్రారంభమైన విషయం తెలిసిందే. పది రోజులుగా హైదరాబాద్‌లో మొదటి షెడ్యూల్‌ చిత్రీకరణ జరుపుకుంది. 'ప్రేమకథా చిత్రమ్' ఫేం నందితా ఇందులో కథానాయిక. ఈ షెడ్యూల్‌లో హీరోయిన్‌ ‘నందితా’ ఇంట్రడక్షన్, సినిమాలో కీలకమైన పోలీస్‌ స్టేషన్‌ సీన్లను ప్రముఖ నటుడు ప్రసన్నపై చిత్రీకరించారు. 
 
ఈ సందర్భంగా దర్శకుడు రాజకిరణ్‌ మాట్లాడుతూ... ‘‘స్విట్జర్లాండ్, అమెరికాలలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. సినిమా మొదటి ఫ్రేమ్‌ నుంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తుంది. నా గత చిత్రాలు ‘గీతాంజలి, త్రిపుర’ కథలలో థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఉన్నట్లుగానే ఈ సినిమా కూడా అదే థ్రిల్‌ మెయింటేన్‌ చేస్తుంది. 
 
ఈ కథ నచ్చి ‘జక్కన్న’ చిత్ర దర్శకుడు ఆకెళ్ల వంశీకృష్ణ మాటలు రాస్తుండటం విశేషం. ఈ చిత్రానికి కెమెరా: అనిల్‌ భండారి, మాటలు: ఆకెళ్ల వంశీకృష్ణ, ఎడిటర్‌: ఉపేంద్ర, ఆర్ట్: చిన్నా. నిర్మాతలు: మాధవి అద్దంకి, కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: రాజకిరణ్‌

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments