Webdunia - Bharat's app for daily news and videos

Install App

శవం ముందు నటి డ్యాన్స్‌.. పోసాని ఫోటోకు దండపడింది.. ధనుష్ పాటకు..?

Webdunia
ఆదివారం, 27 జూన్ 2021 (13:02 IST)
Nandini Roy
నందిని రాయ్ శవం ముందు డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. నందిని రాయ్.. సినిమాల్లో నటించినా అంతగా రాని గుర్తింపు బిగ్ బాస్ షో తో దక్కించుకుంది. నాని హోస్ట్ చేసిన సీజన్‌లో కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌లో అడుగు పెట్టి.. బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా వెబ్ సిరీస్‌లో నటిస్తున్న ఈ చిన్నది. పోసాని శవం దగ్గర డ్యాన్స్ చేస్తున్న వీడియో‌తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 
 
ధనుష్ నటించిన ‘జగమే తందిరమ్‌’ చిత్రంలోని మాస్ బీట్‌కు నందిని డ్యాన్స్ చేసింది. ఆ సినిమాలో కూడా ఓ వ్యక్తి చనిపోయినప్పుడు ఇదే మాస్ బీట్ వస్తుంది. దాన్ని ఇప్పుడు ఇలా పోసాని శవం దగ్గర వాడేసింది నందినీరాయ్. అంతేకాదు ఆ వీడియోను ధనుష్‌కు ట్యాగ్ చేసింది.
 
వివరాల్లోకి వెళితే.. పోసాని కృష్ణ మురళి ఫోటోకు దండపడింది. శవంపై పూజలు జల్లి.. స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్ చూడడానికి వీలుగా పడుకోబెట్టారు. ఫోటో దగ్గర అగరబత్తిని కూడా వెలిగించారు. దీంతో అక్కడ ఉన్నవారందరూ ఏడవాల్సిన సమయంలో నందిని రాయ్ ఓ రేంజ్‌లో స్టెప్‌లు వేసింది. పోసాని శవం పక్కన నందిని రాయ్ డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది. 
 
తాజాగా నందిని రాయ్ పోసాని నటిస్తున్న ‘ఇన్‌ ద నేమ్‌ ఆఫ్‌ గాడ్‌’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తుంది. ఈ సిరీస్ లో పోసాని మరణించే సీన్ ఉందట.. అందులో భాగంగా సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో ఫన్నీ మూమెంట్స్ అంటూ ధనుష్ సాంగ్‌కు నందిని రాయ్ సెట్స్‌లో చిందేసింది. అప్పుడు తీసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. చేసింది.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nandini Rai (@nandini.rai)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అరెరె... ఆడబిడ్డలను రక్షించాలని వెళ్తే ద్విచక్ర వాహనం చెరువులోకి ఈడ్చుకెళ్లింది (video)

నా ప్రియుడితో నేను ఏకాంతంగా వున్నప్పుడు నా భర్త చూసాడు, అందుకే షాకిచ్చి చంపేసాం

Jagan: సినిమా చూపిస్తాం.. తప్పు చేసిన వారికి చుక్కలు ఖాయం.. యాప్ రెడీ.. జగన్

వివాహితను కలిసేందుకు అర్థరాత్రి వెళ్లాడు.. గ్రామస్థుల చేతికి చిక్కి తన్నులు తిన్నాడు..

సునామీ ప్రళయం ముంగిట భారత్? నిజమా? ఇన్‌కాయిస్ ఏమంటోంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments