Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరద సహాయార్థం చంద్రబాబు నాయుడుకి 25 లక్షల విరాళం అందజేసిన నందమూరి మోహన్ రూప

డీవీ
శనివారం, 21 సెప్టెంబరు 2024 (18:15 IST)
chandrababu, rupa, mohanakrishna
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవలే భారీ వర్షాల వల్ల వరదలు రావడం జరిగింది. ముఖ్యంగా విజయవాడలోని బుడమేరు పొంగడంతో భారీ నష్టం వాటిలల్లింది. అయితే ఈ వరద బాధితులకు ఇప్పటికే ఎందరో సినీ ప్రముఖులు అండగా నిలిచారు. నందమూరి మోహన్ కృష్ణ గారు ఫిలిమ్ ఇన్స్టిట్యూట్లో చదివే రోజుల్లో గోల్డ్ మెడలిస్ట్.

అంతేకాక నందమూరి తారక రామారావు గారు నటించిన బ్రహ్మంగారి చరిత్ర, అనురాగ దేవత, చండశాసనుడు, నందమూరి బాలకృష్ణ గారు నటించిన పలు సినిమాలకు, విక్టరీ వెంకటేష్ గారు నటించిన శ్రీనివాస కళ్యాణం, అదే విధంగా తమిళ్ లో శివాని గణేషన్ గారు, ప్రభు గారు నటించిన చరిత్ర నాయగన్, హిందీ లో ఫరూక్ షేక్ గారు నటించిన గర్వాలి బాహర్వాలి సినిమాలకు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గా, పలు సినిమాలకు  నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ గా వ్యవహరించారు. 
 
నందమూరి మోహన కృష్ణ, ఆయన కుమార్తె నందమూరి మోహన రూప తమ వంతు సహాయంగా వరద బాధితుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 25 లక్షలు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తామే స్వయంగా కలిసి తమ చేతులతో 25 లక్షల రూపాయల చెక్కును అందజేయడం జరిగింది.
 
గతంలో కూడా నందమూరి మోహన్ కృష్ణ, నందమూరి మోహన్ రూప ఇదే విధంగా ఎంతోమందికి సహాయం చేయడం జరిగింది. టిటిడి అన్నదాన ట్రస్ట్ కు విరాళాలు ఇచ్చారు. నందమూరి మోహన్ రూప గారు గత ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీ తరఫున చాలా చురుకుగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో కాశ్మీర్ టెక్కీ ఆత్మహత్య.. అంతా ప్రేమ వ్యవహారమే

అసెంబ్లీ మీద అలగడానికో.. మైక్ ఇస్తేనే పోతానని మారాం చేయడానికో కాదు గెలిపించింది.. వైఎస్ షర్మిల

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు- పాఠశాల విద్య కోసం రూ.29,909 కోట్లు (video)

అమరావతి రాజధాని పనులు.. రూ.15,000 కోట్ల రుణం.. ఇక చకచకా ఏర్పాట్లు

నేడు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్... అసెంబ్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

ఉసిరికాయ పొడితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments