Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరవేగంగా షూటింగ్ లో నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి నటిస్తున్న చిత్రం

డీవీ
మంగళవారం, 28 మే 2024 (15:45 IST)
Nandamuri Kalyan Ram new film
తన తాతగారు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా, నందమూరి కళ్యాణ్ రామ్, దర్శకుడు ప్రదీప్ చిలుకూరితో చేస్తున్న తన 21 వ చిత్రం గ్లింప్స్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు #NKR21 ని నిర్మిస్తున్నారు.
 
ది ఫిస్ట్ ఆఫ్ ఫ్రేమ్ అనే గ్లింప్స్ కళ్యాణ్ రామ్‌ని యాక్షన్-ప్యాక్డ్ గా సరికొత్త గెటప్ లో ప్రజెంట్ చేసింది.  వీడియోలో కళ్యాణ్ రామ్ తన పిడికిలిని చూపించడం తన క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్ గా వుంటుందో తెలియజేసింది. వీడియోలో పవర్ ఫుల్ గా కనిపించారు కళ్యాణ్ రామ్. ఈ హై-బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ విజువల్స్ గ్రాండ్ గా వున్నాయి. ఈ గ్లింప్స్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.  
 
ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. బ్లాక్‌బస్టర్‌ 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నటించిన విజయశాంతి చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాకి సైన్ చేశారు. ఇది కర్తవ్యం పాత్ర తరహలో పవర్ ఫుల్ డైనమిక్ పాత్ర కానుంది. ఈ చిత్రంలో సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్,  శ్రీకాంత్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
 
ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నారు. రామ్ ప్రసాద్ డీవోపీ గా పని చేస్తుండగా, అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. వారి టాప్ క్లాస్ పనితనం గ్లింప్స్ లో స్పష్టంగా కనిపిస్తోంది. శ్రీకాంత్ విస్సా స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ చిత్రానికి తమ్మిరాజు ఎడిటర్.
 
సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేయనున్నారు,
 
తారాగణం: నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆరోపణలపై ఆడబిడ్డకో న్యాయం... అదానీకో న్యాయమా? : కె.కవిత

గౌతమ్ అదానీ వ్యవహారం భారత ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది?

బంగాళాఖాతంలో అల్పపీడనం... కోస్తాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు

ప్రభాస్‌తో నాకు రిలేషన్ వున్నట్లు సైతాన్ సైన్యం చేత జగన్ ప్రచారం చేయించారు: షర్మిల

అయ్య బాబోయ్..అదానీ గ్రూప్‌తో ప్రత్యక్ష ఒప్పందం కుదుర్చుకోలేదు.. వైకాపా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments