Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈసారి ఖచ్చితంగా వస్తా బాబాయ్ ... 'ఎమ్మెల్యే' కళ్యాణ్ రామ్

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తాజాగా నటించిన చిత్రం ఎమ్మెల్యే (మంచి లక్షణాలున్న అబ్బాయి). ఉపేంద్ర మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే నెలలో విడుదలకానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ మంగళవారం హై

Webdunia
బుధవారం, 21 మార్చి 2018 (15:50 IST)
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తాజాగా నటించిన చిత్రం ఎమ్మెల్యే (మంచి లక్షణాలున్న అబ్బాయి). ఉపేంద్ర మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే 23వ తేదీన విడుదలకానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ మంగళవారం హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.
 
ఈ వేడుకకు చిత్ర బృందంతో పాటు హీరో అల్లరి నరేష్, డైరెక్టర్ వంశీ పైడిపైల్లి సహా పలువురు సినీ ప్రముఖులు విచ్చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇదంతా పక్కన పెడితే ఈ కార్యక్రమంలో హీరో కల్యాణ్ రామ్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.
 
'నేను ఇండస్ట్రీలో బాబాయ్.. బాబాయ్ అని పిలిచే ఏకైక వ్యక్తి నరేష్. నేను అలా మా బాబాయ్‌ని తప్ప వేరే ఎవరనీ పిలవను. బాబాయ్ తర్వాత నరేష్‌నే అలా పిలుస్తాను. ఫిలింనగర్‌లో నా ఆఫీస్ పక్కనే తన ఆఫీస్ ఉండేది. నాకు పెళ్లి అయ్యే వరకు నరేష్, నేను రోజూ కలిసేవాళ్లం. పెళ్లి తర్వాత నేనే అతడిని కలవడం మానేశాను.. పాపం ఇందులో అతడి తప్పేంలేదు.
 
అప్పటి నుంచి ఇప్పటి వరకు తన(నరేష్) ఆడియో ఫంక్షన్ ఏది జరిగినా మొదటి కాల్ నాకే వస్తుంది. కానీ నేనెప్పుడూ వెళ్లలేకపోయాను. సారీ బాబాయ్.. నువ్వు ఎన్ని సార్లు పిలిచినా రాలేకపోయా. కానీ.. ఇవేమీ మనసులో పెట్టుకోకుండా నా ఫంక్షన్‌కు వచ్చి నన్ను విష్ చేశావు. చాలా థ్యాంక్స్. ఈ సారి నీ సినిమా ఫంక్షన్‌కు ఖచ్చితంగా వస్తా.. నువ్వు వచ్చావని మాత్రం కాదు' అంటూ వ్యాఖ్యానించారు. 
 
అంతకుముందు పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ, సినిమాల్లో ఎమ్మెల్యేగా ఉండటం కాదనీ, రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా ఉండాలని ఆకాంక్షించారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మీదంటూ గుర్తు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

16 యేళ్లలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిందే...

ఢిల్లీలో పవన్ కళ్యాణ్ 'తుఫాన్' - నేడు ప్రధాని మోడీతో భేటీ!!

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments