ముగింపుకు చేరుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ డెవిల్

Webdunia
బుధవారం, 22 మార్చి 2023 (15:08 IST)
Kalyan ram devil
హీరోగా స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్.  దేవాన్ష్‌ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై న‌వీన్ మేడారం ద‌ర్శ‌క‌త్వంలో అభిషేక్ నామా ఈ పీరియాడిక్ డ్రామాను నిర్మిస్తున్నారు. ఉగాది సంద‌ర్భంగా అభిమానులకు, ప్రేక్ష‌కుల‌కు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేస్తూ చిత్ర యూనిట్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. 
 
పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే అందులో క‌ళ్యాణ్ రామ్ డిఫ‌రెంట్ గెట‌ప్‌లో క‌నిపిస్తున్నారు. ఒక చేతిలో ప‌దునైన ఆయుధం ప‌ట్టుకుని ఉన్నారు. మ‌రో చేతిలో గ‌న్‌తో షూట్ చేస్తున్నారు. ఆయ‌న యాక్ష‌న్ మోడ్‌లోని ఇన్‌టెన్స్ లుక్ చూస్తుంటే డెవిల్ వంటి మ‌రో వైవిధ్య‌మైన చిత్రంతో అల‌రించ‌బోతున్నార‌ని తెలుస్తుంది. ఈ సంద‌ర్భంగా .. 
 
చిత్ర నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ ‘‘ప్రేక్ష‌కులంద‌రికి ఉగాది శుభాకాంక్ష‌లు. మా బ్యాన‌ర్‌లో భారీ బ‌డ్జెట్‌తో, ఇప్ప‌టి వ‌ర‌కు ట‌చ్ చేయ‌ని ఓ కొత్త పాయింట్‌ను చూపిస్తూ పీరియాడిక్ మూవీగా డెవిల్ సినిమాను రూపొందిస్తున్నాం. వెర్స‌టైల్ మూవీస్ చేస్తూ వ‌స్తోన్న క‌ళ్యాణ్ రామ్ మ‌రోసారి డెవిల్ సినిమాతో స‌ర్‌ప్రైజ్ ఇస్తారు. సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. న‌వీన్ మేడారంగారు సినిమాను సూప‌ర్బ్‌గా తెర‌కెక్కిస్తున్నారు. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన మ‌రిన్ని అప్‌డేట్స్ అందిస్తాం’’ అన్నారు. 
 
సౌంద‌ర్ రాజన్‌.ఎస్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీతాన్ని ... శ్రీకాంత్ విస్సా కథ,స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పుతిన్-మోడీ ఫ్రెండ్‌షిప్‌ని మా ట్రంప్ దృఢతరం చేసారు, ఇవ్వండి నోబెల్ అవార్డ్, ఎవరు?

పరకామణిలో తప్పు చేసాను, నేను చేసింది మహా పాపం: వీడియోలో రవి కుమార్ కన్నీటి పర్యంతం

Jogi Ramesh: లిక్కర్ కేసు.. జోగి రమేష్‌పై ఛార్జీషీట్ దాఖలు చేసిన సిట్

అందుకే నేను చెప్పేది, పవన్ సీఎం అయ్యే వ్యక్తి, జాగ్రత్తగా మాట్లాడాలి: ఉండవల్లి అరుణ్ కుమార్

బాబాయ్ హత్యే జగన్‌కు చిన్న విషయం, ఇక పరకామణి చోరీ ఓ లెక్కనా: సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments