Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్య సినీ ప్రస్థానానికి 46 యేళ్లు

Webdunia
ఆదివారం, 30 ఆగస్టు 2020 (13:15 IST)
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని అగ్రహీరోల్లో ఒకరు నందమూరి బాలకృష్ణ. ఈయన తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 46 యేళ్లు. పాత్ర ఏదైనా, కథ ఎలాంటిదైనా అందులో ఒదిగిపోయి.. నూటికి నూరుశాతం తన నిబద్ధతను చూపే నటుడుగా నందమూరి బాలకృష్ణ గుర్తింపుపొందాడు.
 
'తాతమ్మ కల' చిత్రంతో పరిచయైనన బాలయ్య.. నాన్నగారి కల నెరవేర్చి నటసింహగా సాంఘీక, పౌరాణిక, జానపద, చారిత్రాత్మక చిత్రాలతో సంచలన విజయాలు సాధిస్తూ 46 ఏళ్ళ సినీ జీవితాన్ని పూర్తి చేసుకున్నారు. 
 
సరిగ్గా 46 యేళ్ల క్రితం విడుద‌లైన 'తాత‌మ్మ క‌ల' చిత్రంలో బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్, అన్న హరికృష్ణతో కలిసి న‌టించారు. ఈ చిత్రంలో తాతమ్మ అయిన భానుమతి కలను నెరవేర్చే ముని మనవుడు బాలకృష్ణగా తొలి చిత్రంలోనే టైటిల్ రోల్ పోషించడం విశేషం.
 
ఈ చిత్రానికి ఎన్టీఆర్ స్టోరీ, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సందేశాత్మ‌క చిత్రంగా రూపొందిన ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రించింది. కాగా, బాల‌కృష్ణ ప్ర‌స్తుతం బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తుండ‌గా, ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కి అభిమానులు, సినీ ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments