గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మోస్ట్ ఎవైటెడ్ మూవీ భగవంత్ కేసరి దసరా సెలవుల్లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసినట్లుగా ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం రిలీజ్, లాంగ్ దసరా హాలీడేస్ సినిమాకు బిగ్ అడ్వాంటేజ్.
రిలీజ్ డేట్ పోస్టర్‌లో బాలకృష్ణ నడిచే వాల్కనో లా వున్నారు. రెండు చేతుల్లో రెండు గన్స్ తో ఫెరోషియస్ గా నడుచుకుంటూ వస్తున్నట్లు కనిపించారు. యూనిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో హై యాక్షన్ ఉంటుంది. అనిల్ రావిపూడి మార్క్ మంచి వినోదం, కుటుంబ భావోద్వేగాలు కూడా ఉంటాయి. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు.
భగవంత్ కేసరిలో కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా, ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. తమ్మి రాజు ఎడిటర్, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్. యాక్షన్ పార్ట్‌కి వి వెంకట్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.