మంజుల, నేను ఒకేసారి ప్రెగ్నెంట్ అయ్యాం.. మహేష్ భార్య నమ్రత

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2022 (09:35 IST)
Namrata
ఘట్టమనేని ఇంటి కోడలు, సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత సంచలన వ్యాఖ్యలు చేసింది. మహేష్ అక్క మంజుల ఒక యూట్యూబ్ ఛానెల్‌ను రన్ చేస్తున్న విషయం విదితమే.ఇక మంజుల గురించి నమ్రత ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం సినిమాలు లేవనే బాధ లేదని చెప్పింది.
 
మళ్లీ సినిమాల్లోకి రావాలని కూడా లేదు. తన కుటుంబ బాధ్యతలను మోయడం తనకు ఎంతో ఇష్టం. జీవితం ఇలా సాగిపోతోంది. చిన్నతనంలో తాను ఎయిర్ హోస్ట్రెస్ అవ్వాలనుకున్నానని తెలిపింది.  
 
ఇక తన ఆడపడుచు మంజుల అంటే తనకెంతో ఇష్టం. తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. మొదటిసారి ఆమెను తాను పార్టీలో చూశాను. అప్పటికి.. తాను, మహేష్ ప్రేమలో ఉన్నట్లు ఆమెకు తెలియదు. ఆ తరువాత మహేష్, తాను ఒక్కటయ్యాం. 
 
"మంజుల, నేను ఒకేసారి ప్రెగ్నెంట్ అయ్యాం. అది యాదృచ్ఛికమో, దేవుని సంకల్పమో తెలియదు. కానీ.. అప్పుడు మంజులకు పిల్లలను కనడం ఇష్టం లేదు. ఇప్పుడు ఒక బిడ్డకు తల్లిగా ఎంతో అందంగా కనిపిస్తోంది" అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నమ్రత వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Naipunyam Portal: 2029 నాటికి యువతకు 20 లక్షల ఉద్యోగాలను సృష్టించాలి.. నారా లోకేష్

ChandraBabu: నాలుగు గంటలే నిద్రపోయే ఏపీ సీఎం చంద్రబాబు.. ఫాలో అవుతున్న నారా లోకేష్

నవంబర్ 8న నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం

2027 Jagan Padayatra: 2027లో జగన్ కొత్త పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారా?

Lizard: వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బంగారు, వెండి ప్రతిమలు మాయం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments