Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముద్దబంతి పువ్వులా ఉండే నమిత మల్లె పువ్వులా మారింది..! ఎలా?

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (18:36 IST)
ముద్దుగా బొద్దుగా ఉండే నమిత ఏకంగా 18 కిలోల బరువు తగ్గింది. ముద్దబంతి పువ్వులా ఉండే తాను మూడు నెలల్లోనే మల్లె పువ్వులా మారానంటోంది. స్లిమ్‌గా అయ్యేందుకు నమిత ఏం చేసిందంటే.. మూడు నెలలుగా కఠినమైన డైట్ మెయింటైన్ చేసింది. లైపోసక్షన్, జిమ్ అంటూ హైరానా పడింది.

ఇలా చేయడం వల్లే 18 కిలోల బరువు తగ్గానని... ఇకపై అదే ఫిజిక్‌ను మెయింటైన్ చేస్తానంటోంది. స్క్రీన్ నిండుగా కనిపించే నమిత బొద్దుగా ఉందనే కారణంతో అవకాశాలు తగ్గిపోయాయి. అందుకే హీరోయిన్లు బరువు తగ్గే పనిలో పడుతున్నారు. ఈ కోవలో నమిత కూడా చేరిపోయింది.
 
స్సెషల్‌ డైట్ పాటిస్తూ కేవలం మూడు నెలల్లోనే భారీగా బరువు తగ్గింది. ఇక రీల్‌ లైఫ్‌ జీరో సైజ్‌ కోసం అనుష్క ఇరవై కిలోల బరువు పెరిగితే..రియల్‌ లైఫ్‌లో జీరో సైజ్‌ కోసం 18 కిలోలు తగ్గింది. స్లిమ్‌గా అయ్యేందుకు తనకిష్టమైన పిజ్జాలను వదలేశానని నమిత తెలిపింది.

కెరీర్ ప్రారంభంలో సన్నగా నాజుకుగా ఉన్న నమిత ఇటు తెలుగునాట, అటు తమిళనాట మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో జెమిని వంటి హిట్ సినిమాలో కనిపించి మంచి పేరు కొట్టేసింది. 
 
తర్వాత కెరీర్‌తో పాటు బరువు కూడా పెరిగింది. ఆ ప్రభావం సినిమాపై పడింది. అప్పటి నుంచి సినిమా అవకాశాలు తగ్గాయి. ఐనా నమిత సింహ సినిమాలో బాలకృష్ణ సరసన నటించి మంచి ఆదరణ పొందింది.

మొత్తంగా నటి నమిత బరువు తగ్గి తన అందంతో సిని ప్రేమీకులను ఊరుతలూగిస్తోంది. బరువు తగ్గడంతో మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశిస్తోంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments