Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీర జవాను కుటుంబానికి యువ హీరో నాగశౌర్య ఆర్థిక సాయం

Webdunia
శనివారం, 10 అక్టోబరు 2015 (17:22 IST)
సరిహద్దుల్లో ఉగ్రవాదుల తూటాలకు బలై వీరమరణం పొందిన బొట్ట సత్యం కుటుంబాన్ని హీరో నాగశౌర్య శుక్రవారం పరామర్శించారు. ఈ నెల 5న జమ్మూ-కాశ్మీర్ సమీపంలోని కుప్పవాడ ప్రాంతంలోని అంద్వారా వద్ద జరిగిన కాల్పుల్లో విజయనగరం జిల్లా బాడంగి మండలం గొల్లాది గ్రామానికి చెందిన బొట్ట సత్యం వీరమరణం పొందిన సంగతి తెలిసిందే.
 
 
ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన జవాను సత్యం భార్య శ్రీవాణి బొబ్బిలిలోని స్థానిక గొల్లవీధిలో నివాసముంటున్నారు. ఆ ఇంటికి హీరో నాగశౌర్య స్వయంగా వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబానికి మేమంతా అండగా ఉంటామన్నారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటానన్నారు. అనంతరం రూ.50,000 పిల్లల పేరు మీద ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. 
 
ఈ సందర్భంగా హీరో నాగశౌర్య మాట్లాడుతూ... దేశ రక్షణ కోసం వీర జవాన్ సత్యం... పోరాడి అశువులు బాశారు. అలాంటి వీరుడి కుటుంబాన్ని పరామర్శించడం నా బాధ్యతగా భావించాను. అందుకే కుటుంబ సభ్యుల వద్దకు నేరుగా వెళ్లి ఓదార్చాలని నిర్ణయించుకొని... ఇక్కడికి వచ్చాను. మనం ఇంత ప్రశాంతంగా ఉంటున్నామంటే సైనికుల పుణ్యమే. వీర జవాను కుటుంబానికి నేను చేసింది చిరు సాయమే. మా కుటుంబం స్ఫూర్తితోనే సేవా కార్యక్రమాలు చేపడుతున్నాను. చిత్ర పరిశ్రమ ఇలాంటి కార్యక్రమాలకు ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంద అని అన్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments