Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవంబర్ 12న విడుద‌ల‌వుతున్న నాగశౌర్య - లక్ష్య

Webdunia
సోమవారం, 27 సెప్టెంబరు 2021 (17:18 IST)
Naga Shourya look
పార్ధుడికి గురి మాత్రమే కనిపిస్తుంది- అనే కాప్ష‌న్‌తో నాగ శౌర్య 20వ చిత్రం `లక్ష్య` విడుద‌ల తేదీ పోస్ట‌ర్‌ను సోమ‌వారంనాడు చిత్ర యూనిట్ విడుద‌ల‌చేసింది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్య‌క్ర‌మాలు జరుగుతున్నాయి. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న‌ ఈ చిత్రంలో నాగ శౌర్య సరసన కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది.
 
సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. ప‌తాకాల‌పై  నారాయణ్ కె నారంగ్, పుస్కూరు రామ్‌ మోహన్ రావు, శరత్ మరార్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
ఆదివారం ఈ మూవీ యూనిట్ లక్ష్య చిత్రం ఎప్పుడు విడుదల కాబోతోందని మీరు ఊహిస్తున్నారు? అంటూ నెటిజ‌న్ల‌కు ఓ పజిల్ ఇచ్చింది  ఆప్షన్‌లుగా నాలుగు తేదిల‌ను ఇచ్చింది. అయితే తాజాగా ఈ మూవీ విడుదల తేదీని మేకర్లు అధికారికంగా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం నవంబర్ 12న విడుద‌ల‌కాబోతుంది.
 
ఈ సంద‌ర్భంగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్‌లో షర్ట్ లేకుండా నాగ శౌర్య డిఫ‌రెంట్ గెట‌ప్‌లో క‌నిపించారు.  ఆయన హెయిర్ స్టైల్ కూడా కొత్తగా ఉంది. ఇక కండలు తిరిగిన దేహంతో నాగ శౌర్య లుక్ వావ్ అనిపిస్తోంది. విలు విద్యలో ఆరితేరిన ఆటగాడిగా ఈ సినిమాలో నాగ‌శౌర్య ఇది వ‌ర‌కెన్న‌డూ చూడ‌ని లుక్‌లో క‌నిపించ‌నున్నారు. ఈ స్పోర్ట్స్ డ్రామాలో నాగ శౌర్య రెండు విభిన్నమైన గెటప్పుల్లో కనిపించబోతోన్నారు.
 
సంతోష్ జాగర్లపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం కోసం నాగ శౌర్య విలువిద్య‌లో  ప్రత్యేక శిక్షణ  తీసుకున్నారు. జగపతి బాబు ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీటింగ్ మధ్యలోనే వదిలేసి బైటకొచ్చి ఆఫీసు భవనం పైనుంచి దూకి టెక్కీ సూసైడ్

భర్తను సజీవదహనం చేసిన భార్య... ఎక్కడ?

18 సంవత్సరాలలో ఇదే మొదటిసారి- నాగార్జున సాగర్ జలాశయంలో గేట్ల ఎత్తివేత

సరస్వతీ పవర్ షేర్ల రద్దుకు అనుమతించిన ఎన్‌సీఎల్‌టీ- జగన్ పిటిషన్‌కు గ్రీన్ సిగ్నల్

నిన్నే ప్రేమిస్తున్నా, మాట్లాడుకుందాం రమ్మని లాడ్జి గదిలో అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments