Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంధుడి పాత్రలో నాగార్జున... మలయాళ హీరో ఆదర్శంగా...

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ అంధుడి పాత్రలో నటించి మెప్పించిన ఈ సినిమా మాలీవుడ్‌లో సంచలన విజయాన్ని సొంతం చేసుకుని... భారీ కలెక్షన్లను రాబడుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రయోగాత్మక చిత్రంపై ఇప్పుడు అందరి

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (16:24 IST)
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ అంధుడి పాత్రలో నటించి మెప్పించిన ఈ సినిమా మాలీవుడ్‌లో సంచలన విజయాన్ని సొంతం చేసుకుని... భారీ కలెక్షన్లను రాబడుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రయోగాత్మక చిత్రంపై ఇప్పుడు అందరి కన్నూ పడింది. దీన్ని హిందీలో రీమేక్ చేయడానికి ఇప్పటికే అక్షయ్ కుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. తనకు అత్యంత ప్రియమైన డైరెక్టర్ ప్రియదర్శన్ ఈ సినిమాను రూపొందించి ఉండటంతో అక్షయ్ మరో ఆలోచన లేకుండా హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తెలుగు రీమేక్ గురించి చాన్నాళ్లుగా జరుగుతున్న చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్టు సమాచారం. 
 
దీన్ని తెలుగులో నాగార్జున రీమేక్ చేయనున్నాడని వార్తలు వెలువడుతున్నాయి. ప్రయోగాత్మక సినిమాల పట్ల ఉత్సాహం చూపించే నాగ్.. అంధుడి పాత్రను చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాడని సమాచారం. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో.. మన హీరో గుడ్డివాడు. అయితే అతను ఉండే అపార్టుమెంటులో ఒక మర్డర్ జరుగుతుంది. 
 
ఆ మర్డర్‌ని హీరో ఎలా రీసెర్చ్ చేసి తన వైకల్యాన్ని అధిగమించి ఆ హంతకుడిని పట్టుకుంటాడనేదే ఈ థ్రిల్లర్ సారాంశం. అయితే ఇప్పుడు తెలుగులో నాగార్జున ఈ అంధ హీరో పాత్రను చేస్తే బాగుంటుందని నిర్మాతలు ఆలోచిస్తున్నారట. ఇప్పటికే తెలుగులో ఊపిరి వంటి ఛాలెంజింగ్ రోల్‌లో నటించిన నాగార్జున ఇప్పుడు ఈ పాత్రను చేయడానికి అంగీకరించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహా కుంభమేళాలో అంబానీ కుటుంబం పవిత్ర స్నానం (Video)

Work From Home: మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం.. చంద్రబాబు గుడ్ న్యూస్

ఆ పవరేంటి బ్రో... మంత్రపఠనంతో కోతికి మళ్లీ ఊపిరి (Video)

శ్రీశైలం వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి- చంద్రబాబు

సైబర్ సెక్యూరిటీ విద్య బలోపేతం: EC-కౌన్సిల్ విశ్వవిద్యాలయంతో KLH బాచుపల్లి క్యాంపస్ భాగస్వామ్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పసుపు కలిపిన ఉసిరి రసం తాగితే?

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

తర్వాతి కథనం
Show comments