Webdunia - Bharat's app for daily news and videos

Install App

''మ‌న్మ‌థుడు'' సినిమాకు సీక్వెల్.. రకుల్, నాగార్జున జంటగా..?

Webdunia
మంగళవారం, 26 మార్చి 2019 (11:07 IST)
''మ‌న్మ‌థుడు'' సినిమాకు సీక్వెల్ రానుంది. కింగ్ నాగార్జున రూపొందిస్తున్న ఈ సినిమా మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై తెరకెక్కనుంది. నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్ ‌(జెమిని కిర‌ణ్‌) నిర్మిస్తున్న ''మ‌న్మ‌థుడు 2" సినిమా ప్రారంభోత్సవం లాంఛ‌నంగా అన్న‌పూర్ణ స్టూడియోలో ప్రారంభ‌మైంది. చిత్ర యూనిట్‌తో పాటు అక్కినేని అమ‌ల‌, నాగ‌చైత‌న్య ముఖ్య అతిథులుగా ఈ కార్య‌క్రమంలో పాల్గొన్నారు.
 
అమ‌ల అక్కినేని ముహుర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ కొట్ట‌గా.. అక్కినేని నాగ‌చైత‌న్య కెమెరా స్విచ్ఛాన్ చేశారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ యూర‌ప్‌లో ప్రారంభం కానుంది. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైన‌ర్‌గా ఈ సినిమాను రాహుల్ ర‌వీంద్ర‌న్ తెర‌కెక్కించ‌నున్నారు. ఆర్ ఎక్స్ 100 ఫేమ్  చైత‌న్య భ‌ర‌ద్వాజ్ ఈ చిత్రానికి సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. ఎం.సుకుమార్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.
 
కింగ్ నాగార్జున‌, రకుల్ ప్రీత్ సింగ్, ల‌క్ష్మి, వెన్నెల‌కిషోర్‌, రావు ర‌మేష్‌, నాజ‌ర్‌, ఝాన్సీ, దేవ‌ద‌ర్శిని త‌దిత‌రులు నటించిన ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం:  రాహుల్ ర‌వీంద్ర‌న్‌, సినిమాటోగ్ర‌ఫీ:  ఎం.సుకుమార్‌, స్క్రీన్‌ప్లే:  రాహుల్ ర‌వీంద్ర‌న్, స‌త్యానంద్‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments