Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నా హీరో సూపర్... వస్తున్నాం.. మళ్లీ కొడుతున్నాం.. ఇది ఫిక్స్' అంటున్న మన్మథుడు

తన పెద్ద కుమారుడు నాగ చైతన్యపై హీరో, నిర్మాత నాగార్జున ప్రశంసల వర్షం కురిపించారు. ఓ తండ్రిగా కాదు.. ఓ నిర్మాతగా చెపుతున్నా.. నా హీరో సూపర్ అంటూ కితాబిచ్చాడు. నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించ

Webdunia
మంగళవారం, 23 మే 2017 (09:13 IST)
తన పెద్ద కుమారుడు నాగ చైతన్యపై హీరో, నిర్మాత నాగార్జున ప్రశంసల వర్షం కురిపించారు. ఓ తండ్రిగా కాదు.. ఓ నిర్మాతగా చెపుతున్నా.. నా హీరో సూపర్ అంటూ కితాబిచ్చాడు. నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం "రారండోయ్ వేడుక చూద్దాం" చిత్రం ఆడియో ఇటీవల జరిగింది. 
 
ఇందులో ఈ చిత్ర నిర్మాత అక్కినేని నాగార్జున మాట్లాడుతూ 'ఈ సినిమాలో చక్కటి పల్లెటూరి పిల్లలాగా రకుల్ ప్రీత్ సింగ్ ఓణీలు వేసుకుంటుంది. ఈ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇక, కొడుకు గురించి తండ్రి ఎక్కువ పొగడకూడదు. మరి ఎలా? ఈ సినిమాకు నేను ప్రొడ్యూసర్‌ని...  ప్రొడ్యూసర్‌గా చెబుతున్నాను.. నా హీరో సూపర్. చాలా బాగా చేశాడు. మీరు, ఎలా చూడాలనుకుంటున్నారో అలా చేశాడు. ఈ సినిమాలో కొత్త నాగ చైతన్యను చూస్తారు.. అతనితో ప్రేమలో పడిపోతారు. మై హీరో సూపర్.. నేను శిల్పకళా వేదికలో ‘సోగ్గాడే చిన్నినాయన’ ఆడియో ఫంక్షన్‌లో ఆ రోజు నేను ఏమన్నాను.. ఇప్పుడు మళ్లీ అదే చెబుతున్నా, వస్తున్నాం.. మళ్లీ కొడుతున్నాం..ఇది ఫిక్స్’ అని నాగార్జున హుషారుగా అన్నారు.
 
ఇక హీరో నాగ చైతన్య మాట్లాడుతూ... ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా చేస్తున్నప్పుడు తాను మొదట భయపడ్డానని, ఎందుకంటే, ఈ తరహా చిత్రంలో నటించడం తనకు ఇదే మొదటి సారి అని, ఇప్పుడు ఆ భయం పోయిందన్నాడు. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని అన్నాడు. భ్రమరాంబ పాత్రలో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ నటన బాగుందని, ఏ హీరోయిన్ రకుల్ పాత్రను అంత అద్భుతంగా పోషించలేదని కితాబు ఇచ్చాడు. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments