Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్ద పండుగకు వస్తానంటున్న 'బంగార్రాజు'

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (19:09 IST)
సాధారణంగా సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ. ఈ నానుడి మన తెలుగు నాట ఎప్పటి నుంచో వుంది. ఆ మూడు రోజుల పండుగను దృష్టిలో పెట్టుకుని పలు సినిమాలను రిలీజ్ చేస్తుండటం అనాదిగా వస్తుంది. 
 
ముఖ్యంగా తమ సినిమాలు సంక్రాంతికి రిలీజ్ కావడాన్ని స్టార్ హీరోలు స్టేటస్‌గా.. సెంటిమెంటుగా ఫీలవుతుంటారు. ఆ పండక్కి రిలీజ్ అయ్యే సినిమాల కలెక్షన్లు కూడా గట్టిగానే ఉంటాయి. అందుకే, చాలామంది తమ సినిమాలను సంక్రాంతికి ప్లాన్ చేస్తుకుంటారు.
 
ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా కొన్ని భారీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో ప్రధానంగా చెప్పుకోవలసింది రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్'. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి ఓ వారం ముందుగానే వస్తోంది. 
 
అలాగే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'భీమ్లా నాయక్', ప్రభాస్ నటిస్తున్న 'రాధేశ్యామ్', మహేశ్ నటిస్తున్న 'సర్కారు వారిపాట' కూడా సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. 
 
ఈ క్రమంలో అక్కినేని నాగార్జున కూడా సంక్రాంతి బరిలో నిలవడానికి సిద్ధమయ్యారట. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున - రమ్యకృష్ణ జంటగా 'బంగార్రాజు' సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. 
 
ఇది గతంలో నాగార్జున నటించిన 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న సంగతి విదితమే. ఆ చిత్రం కూడా అప్పట్లో సంక్రాంతికే విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఆ సెంటిమెంటుతోనే ఇప్పుడు దీనిని కూడా పెద్ద పండక్కి విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

'విశ్వ సుందరి'గా డెన్మార్క్ అందాల భామ

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షల నోట్లు

గుంటూరు మేయరుపై కేసు నమోదు... అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు

లేడీ టీచర్ కుర్చీ కింద బాంబు అమర్చి రిమోట్‌తో పేల్చిన విద్యార్థులు.. ఎక్కడ?

రూ.25 లక్షలు లంచం పుచ్చుకుంటూ పట్టుబడిన డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

తర్వాతి కథనం
Show comments