Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు సినిమా క్వాలిటీని పెంచిన రాజమౌళి: నాగార్జున ప్రశంసల వర్షం

అడవి రాముడు, ప్రేమాభిషేకం, మాయాబజార్ వంటి సినిమాల తర్వాత తెలుగు సినిమాల క్వాలిటీని రాజమౌళి ఎక్కడికో తీసుకెళ్లి పోయాడు అంటూ టాలీవుడ్ హీరో నాగార్జున ప్రశంసించారు. తెలుగు సినిమా సగటు బడ్జెట్ 50 కోట్లు అనుకుంటే బాహుబలి-2 సినిమా 1500 కోట్లు వసూళ్లు చేసింద

Webdunia
బుధవారం, 24 మే 2017 (08:09 IST)
అడవి రాముడు, ప్రేమాభిషేకం, మాయాబజార్ వంటి సినిమాల తర్వాత తెలుగు సినిమాల క్వాలిటీని రాజమౌళి ఎక్కడికో తీసుకెళ్లి పోయాడు అంటూ టాలీవుడ్ హీరో నాగార్జున ప్రశంసించారు. తెలుగు సినిమా సగటు బడ్జెట్ 50 కోట్లు అనుకుంటే బాహుబలి-2 సినిమా 1500 కోట్లు వసూళ్లు చేసిందంటే మామూలు విషయం కాదని, ఎంత పెద్ద కలలు కంటే అంత చక్కటి విజయాన్ని అందుకోవచ్చని రాజమౌళి బాహుబలి-2 ద్వారా చాటి చెప్పారని నాగార్జున పేర్కొన్నారు. 
 
కుమారుడు నాగచైతన్య (చైతూ) హీరోగా కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో నాగార్జున నిర్మించిన ‘రారండోయ్‌.. వేడుక చూద్దాం’ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగార్జున పాత్రికేయులతో ముచ్చటించారు.
"50 కోట్లు ఎక్కడ 1500 కోట్లు (‘బాహుబలి–2’ వసూళ్లను ఉదహరిస్తూ) ఎక్కడ? కొన్నాళ్లు అందరూ క్లబ్బుల గురించి మాట్లాడడం మానుకోవాలి. గతేడాదే నేను క్లబ్బుల గురించి మాట్లాడ వద్దని చెప్పా. బడ్జెట్‌ ఎంత వసూళ్లెన్ని! అనేవి చూసుకోవాలి. ‘బాహుబలి’తో రాజమౌళి ‘డ్రీమ్‌ బిగ్‌. యు మైట్‌ అచీవ్‌ ఇట్‌’ అని చెప్పారు. తెలుగు సినిమా క్వాలిటీని పెంచారు. ‘బాహుబలి’కి ముందు ‘అడవి రాముడు, ప్రేమాభిషేకం, మాయాబజార్‌’... ఇలా తెలుగు సినిమావాళ్లు ఎప్పటికప్పుడు సర్‌ప్రైజ్‌ చేస్తూనే ఉన్నారు." అన్నారు నాగార్జున.
 
నిర్మాత అంటే చెక్కుల మీద సంతకం పెట్టడం కాదు. ప్రతి పనినీ దగ్గరుండి చూసుకోవాలి. నాన్నగారు, నాన్నగారి నిర్మాతల నుంచి నేను నేర్చుకున్నది అదే. నేను నిర్మించే ప్రతి సినిమా పనులను దగ్గరుండి చూసుకుంటా. చైతూ, అఖిల్‌ ఇతర సంస్థల్లో చేస్తుంటే నేను వేలు పెట్టను. వాళ్లతో కంటిన్యూస్‌గా సినిమాలు తీసే ఓపిక నాకు లేదు. వాళ్లిద్దరున్నారు, నేను... ఏడాదికి మా సంస్థలో ఒక్కో సినిమా చేయగలమంతే అన్నారు నాగార్జున.
 
అన్నట్లు.. ‘విక్రమ్‌’ విడుదలై మంగళవారం నాటికి 31 ఏళ్లయ్యింది. నాగార్జునకు  ఆ విషయమే గుర్తులేదు కానీ ఆయన సతీమణి అమల ‘పార్టీ టు నైట్‌’ అని మెస్సేజ్‌ పెట్టింది ఇందుకా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు నాగార్జున.
 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

ఎల్లో మీడియా రాళ్లేస్తోంది.. 48 గంటలే టైమ్... జగన్ లుక్‌పై నెట్టింట చర్చ? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments