Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్రవరి 10న అక్కినేని నాగార్జున, కె.రాఘవేంద్రరావుల 'ఓం నమో వేంకటేశాయ'

అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి చిత్రాలు ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకున్నాయో తెలిసిందే. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న మరో భక్తిరస చిత్రం 'ఓం నమో వెంకటేశాయ'. సాయికృపా

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2016 (17:46 IST)
అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి చిత్రాలు ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకున్నాయో తెలిసిందే. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న మరో భక్తిరస చిత్రం 'ఓం నమో వెంకటేశాయ'. సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై ఎ.మహేష్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నారు. అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్‌ లుక్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. 
 
నాగార్జున కెరీర్‌లోనే హయ్యస్ట్‌ బిజినెస్‌ జరుగుతోంది. ఓవర్సీస్‌ రైట్స్‌లో, శాటిలైట్‌ రైట్స్‌లో, ఇక్కడ అన్ని ఏరియాల్లో క్రేజీగా బిజినెస్‌ జరుగుతోంది. రాబోయే సినిమాల్లో హై ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్న సినిమా 'ఓం నమో వేంకటేశాయ'. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం గ్రాఫిక్‌ వర్క్‌ జరుగుతోంది. ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
 
అక్కినేని నాగార్జున హాథీరామ్‌ బాబాగా మరో అద్భుతమైన పాత్ర చేస్తున్న ఈ చిత్రంలో వేంకటేశ్వరస్వామిగా సౌరబ్‌జైన్‌ నటిస్తుండగా, భక్తురాలు కృష్ణమ్మగా అనుష్క కనిపించనుంది. జగపతిబాబు, ప్రగ్యా జైస్వాల్‌, విమలా రామన్‌, రావు రమేష్‌, వెన్నెల కిషోర్‌, ప్రభాకర్‌, రఘుబాబు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
 
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు రూపొందిస్తున్న ఈ చిత్రానికి స్వరవాణి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఎస్‌.గోపాల్‌రెడ్డి, జె.కె.భారవి, కిరణ్‌కుమార్‌ మన్నె, గౌతంరాజు ఇతర సాంకేతిక వర్గం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తలపై జీలకర్ర బెల్లంతో గ్రూపు-2 పరీక్ష రాసిన నవ వధువు (Video)

ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందం... (Video)

ప్రతిపక్షహోదా ఇవ్వకపోయినా ప్రజా సమస్యల కోసం జగన్ సభకు వస్తున్నారు : వైవీ సుబ్బారెడ్డి

మరింతగా విషమించిన పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం!!

పట్టపగలు కార్పొరేటర్‌ను కిడ్నాప్ చేసిన వైకాపా నేత... ఏపీలో ఇంకా వైకాపా రూలే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

తర్వాతి కథనం
Show comments