Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగార్జున, కార్తీ, తమన్నా 'ఊపిరి' షూటింగ్‌ పూర్తి - మార్చిలో విడుదల

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2016 (17:32 IST)
'సోగ్గాడే చిన్ని నాయనా' వంటి సూపర్‌హిట్‌ చిత్రంతో 50 కోట్ల క్లబ్‌లో చేరిన కింగ్‌ నాగార్జున, 'ఆవారా' కార్తీ, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో పి.వి.పి. పతాకంపై ప్రముఖ నిర్మాత పొట్లూరి వి.ప్రసాద్‌, 'బృందావనం' 'ఎవడు' చిత్రాల యువ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్‌ 'ఊపిరి'. ఈ చిత్రానికి సంబంధించిన టోటల్‌ షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌‌ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మార్చిలో విడుదల చేయడానికి నిర్మాత ప్రసాద్‌ వి. పొట్లూరి సన్నాహాలు చేస్తున్నారు. 
 
ఈ సందర్భంగా నిర్మాత ప్రసాద్‌ వి. పొట్లూరి మాట్లాడుతూ - ''ఫ్రాన్స్‌, బల్గేరియా, స్లోవేనియా వంటి ప్రాంతాల్లో ఇప్పటివరకు ఎవ్వరూ షూట్‌ చెయ్యని లొకేషన్స్‌లో ఈ చిత్రాన్ని షూట్‌ చెయ్యడం జరిగింది. షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. డెఫినెట్‌గా నాగార్జునగారి కెరీర్‌లో 'ఊపిరి' మరో మెమరబుల్‌ మూవీ అవుతుంది. అలాగే కార్తీ ఫస్ట్‌ టైమ్‌ తెలుగులో చేస్తున్న ఈ స్ట్రెయిట్‌ సినిమా అతని కెరీర్‌లో మరో మంచి చిత్రమవుతుంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం మా పివిపి సంస్థలో మరో ప్రతిష్ఠాత్మక చిత్రమవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మార్చిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు. 
 
దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ - ''ఇద్దరు వేర్వేరు వ్యక్తుల మధ్య ఏర్పడిన స్నేహం, తద్వారా జరిగే ఓ ఎమోషనల్‌ జర్నీ ప్రధానాంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సినిమా ఓ కలర్‌ఫుల్‌ సెలబ్రేషన్‌లా వుండబోతోందని, అందరికీ సంతోషాన్ని పంచే చక్కని చిత్రం అవుతుందన్న పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ వస్తున్నాయి. నాగార్జునగారు, కార్తీ స్నేహితులుగా ఎక్స్‌ట్రార్డినరీగా పెర్‌ఫార్మ్‌ చేశారు. అన్ని వయసుల వారిని ఎంటర్‌టైన్‌ చేసేలా ఈ చిత్రం రూపొందింది'' అన్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments