Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజ‌య‌వాడ ఎం.పి. గురించి క్లారిటీ ఇచ్చిన‌ నాగార్జున!

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (17:54 IST)
Nagarjuna
అక్కినేని నాగార్జున వైసి.పి. రాజ‌కీయ పార్టీలోకి చేరబోతున్నారనే వార్త ఇప్పటి నుంచే కాదు చాలా కాలంగా వినిపిస్తూనే ఉంది. సోషల్ మీడియాలో ఈ టాపిక్ ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంది. సినిమాలతో పాటు వ్యాపార వేత్తగా నాగార్జున రాణిస్తున్నారు. వైఎస్ కుటుంబంతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో జగన్ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లినప్పుడు కూడా అనేక సార్లు నాగార్జున జైలుకు వెళ్లి మరీ పరామర్శించి వచ్చాడు.
 
క‌ట్ చేస్తే, తాజాగా ఆయ‌న విజ‌య‌వాడ నియోజ‌క‌వ‌ర్గ ఎం.పి.గా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఛాన్స్ వుంద‌నే వార్త‌లు గ‌ట్టిగా వినిపిస్తున్నాయి. ఈ విష‌య‌మై శుక్ర‌వారం సాయంత్రం ద ఘోస్ట్ ట్రైల‌ర్ రిలీజ్‌లో హైద‌రాబాద్‌లో స‌మాధాన‌మిస్తూ. ఎన్నో ఏళ్ళుగా నేను రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. నేను రాజకీయాల్లోకి వస్తున్నాననే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని అన్నారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టత ఇచ్చారు.
 
కాగా, ద ఘోస్ట్ సినిమా త‌ర్వాత కొంత‌కాలం న‌టుడిగా గేప్ తీసుకోనున్న‌ట్లు వెల్ల‌డించారు. ఆ త‌ర్వాత త‌న అభిప్రాయం ఏమైనా మార్చుకుంటారేమో చూడాల‌ని కొంద‌రు తెలియ‌జేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిల్లర రాజకీయాలతో పాదయాత్ర అంటూ వస్తే చెప్పుతో కొడతారు : బైరెడ్డి శబరి

ఒక్కరవ దెబ్బకే ఎలా చచ్చిపోతాడు, ఆంబులెన్సులో ఏదో జరిగింది: సింగయ్య భార్య (video)

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అదృశ్యం

Chandra babu: సీఎం చంద్రబాబు కాన్వాయ్‌లో చర్మకారుడు.. వీడియో వైరల్

సారా కాసేవాళ్లే జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తారు : బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments