Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను మీ నాగార్జునను.. ఇరానీ ఛాయ్‌, కరాచీ బిస్కెట్‌, హైదరాబాద్ బిర్యానీ... (Video)

ఠాగూర్
గురువారం, 9 జనవరి 2025 (17:42 IST)
నేను.. మీ నాగార్జునను, చిన్నప్పటి నుంచి తెలంగాణా మొత్తం తిరిగాను.. ఇక్కడి పర్యాటక అందాలను తిలకించేందుకు పర్యాటకులు రాష్ట్రానికి రావాలని హీరో అక్కినేని నాగార్జున పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కోసం తన వంతుగా పర్యాటకులను ఆహ్వానిస్తూ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. 
 
'అందరికీ నమస్కారం.. నేను మీ నాగార్జున. చిన్నప్పటి నుంచి తెలంగాణ మొత్తం తిరిగాను. ఇక్కడ అద్భుతమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. జోదేఘాట్‌ వ్యాలీ, మిట్టే, బొగత జలపాతం అందంగా ఉంటాయి. ఇక ఆలయాల విషయానికొస్తే, వరంగల్‌లో వెయ్యి స్తంభాల గుడి, రామప్ప ఆలయం. దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. ప్రతి ఒక్కరూ చూడాలి. నిజంగా ఎంతో అందమైనదే కాదు, ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది. 
 
యాదగిరి గుట్ట చాలా సార్లు వెళ్లాను. ఆ ఆధ్యాత్మిక అనుభూతిని మాటల్లో వర్ణించలేను. తెలంగాణ భోజనంలో జొన్నరొట్టె, అంకాపూర్‌ చికెన్‌.. స్నాక్స్‌ విషయానికొస్తే, సర్వపిండి చాలా ఇష్టం. ఇరానీ ఛాయ్‌, కరాచీ బిస్కెట్‌, హైదరాబాద్‌ బిర్యానీ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. ఇవన్నీ మర్చిపోలేను. మీతో చెబుతుంటే నా నోరూరుతోంది. ప్రజల ఆదరణ కూడా చాలా బాగుంటుంది. మీరందరూ రండి. తెలంగాణలో ప్రతి ప్రాంతాన్ని ఆస్వాదించండి. మా తెలంగాణకు త్వరగా రండి' అని పిలుపునిచ్చారు. ఈ వీడియోను ఎక్స్‌ వేదికగా షేర్‌ చేసిన తెలంగాణ టూరిజం.. నటుడు నాగార్జునకు కృతజ్ఞతలు తెలిపింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింధు జలాలను ఆపేస్తారు సరే, ఆ నీటిని ఎటు పంపుతారు?: అసదుద్దీన్ ఓవైసి ప్రశ్న

పహల్గాం దాడికి ఎలాంటి ప్రతీకారం తీర్చుకున్నా సంపూర్ణ మద్దతు : రాహుల్ గాంధీ

పహల్గాం దాడితో ఆగిన పెళ్లి - భారత భూభాగంలో వరుడు .. పాకిస్థాన్ గ్రామంలో వధువు

Asaduddin Owaisi: పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాదులో ముస్లింల నిరసన (video)

సామాజిక సేవ చేసే మొదటి నటుడిగా చిరంజీవి నిలిచారు: సీఎం చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments