Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా సామి రంగ ఫస్ట్ సింగిల్ ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుంది అనౌన్స్ మెంట్

Webdunia
బుధవారం, 6 డిశెంబరు 2023 (23:13 IST)
Nagarjuna Akkineni
నాగార్జున అక్కినేని, ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వంలో చేస్తున్న 'నా సామి రంగ' సినిమాని పూర్తిచేసే పనిలో బిజీగా ఉన్నారు. దర్శకుడిగా విజయ్ బిన్నికి ఇది తొలి చిత్రం.  ఆశికా రంగనాథ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆమె పాత్రను వరలక్ష్మిగా తాజాగా పరిచయం చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు విడుదల చేసిన గ్లింప్స్ లో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ కట్టిపడేసింది.
 
ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్‌ ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుంది త్వరలో విడుదల కానుంది. లిరికల్ వీడియోను లాంచ్ చేయడానికి ముందు పాట ప్రోమోను విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. రైతు గెటప్‌లో నాగార్జున చాలా ఎలిగెంట్ గా కనిపించారు. వ్యవసాయ భూమిలో ట్రాక్టర్‌ పై కాలు వేసి బీడీ కాలుస్తూ మాస్ వైబ్ తో ఆకట్టుకున్నారు నాగార్జున.
 
గ్లింప్స్ లో అద్భుతమైన బీజీఎంతో మంత్రముగ్ధులను చేసిన ఎంఎం కీరవాణి ఈ చిత్రంకు అద్భుతమైన సౌండ్‌ట్రాక్‌లను అందించారు. ఆల్బమ్‌లోని అన్ని పాటలకు చంద్రబోస్ లిరిక్స్ రాశారు.
 
మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి మ్యాసివ్ బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందించారు.
 ‘నా సామి రంగ’ 2024 సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

తెలంగాణ జిల్లాలకు ఎల్లో అండ్ ఆరెంజ్ అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

కోలుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ (photo)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments