Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగశౌర్య సమంత కోసం ఆ సినిమాలో నటిస్తున్నాడా?

హీరో నాగశౌర్య సమంత కోసం ఓ సినిమాలో సంతకం చేశాడని టాక్ వస్తోంది. సమంత ప్రధాన పాత్రలో నందినిరెడ్డి దర్శకత్వంలో సౌత్ కొరియన్ కామెడీ డ్రామా 'మిస్ గ్రానీ'కి రీమేక్ అవుతోన్న సంగతి తెలిసిందే.

Webdunia
శుక్రవారం, 19 అక్టోబరు 2018 (18:25 IST)
హీరో నాగశౌర్య సమంత కోసం ఓ సినిమాలో సంతకం చేశాడని టాక్ వస్తోంది. సమంత ప్రధాన పాత్రలో నందినిరెడ్డి దర్శకత్వంలో సౌత్ కొరియన్ కామెడీ డ్రామా 'మిస్ గ్రానీ'కి రీమేక్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హీరోయిన్ చుట్టూ తిరుగుతుంది. ఇందులో హీరో పాత్రకు అంత ప్రాధాన్యముండదు. అలాంటి పరిస్థితుల్లో నాగశౌర్య సమంతతో సినిమా చేయాలనే ఉద్దేశంతోనే ఈ చిత్రం కోసం సంతకాలు చేసివుంటాడని టాక్ వస్తోంది. 
 
సినిమా కథ విషయానికి వస్తే... ఓ 70 ఏళ్ళ వృద్ధురాలు, 20 ఏళ్ళ అమ్మాయిగా మారుతుంది. ఆ సమయంలో పడుచు శరీరంలో వున్న ముసలి బామ్మ ఏం చేసిందనేది కథ. 70 ఏళ్ళ బామ్మలా, 20 ఏళ్ళ అమ్మాయిలా... రెండు డిఫరెంట్ షేడ్స్ వున్న క్యారెక్టర్ కనుక సమంత ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కథలో హీరో పాత్రకు వెయిట్ ఎక్కువ వుండదు. అందుకే నాగశౌర్య ఎలా ఒప్పుకున్నాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. 
 
సమంతతో నాగశౌర్య ఇప్పటివరకూ నటించలేదు. ఆమెతో నటించే అవకాశం రావడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని సమాచారం. కానీ దర్శకురాలు నందినిరెడ్డికి ఇచ్చిన మాట కోసం ఈ సినిమాలో నాగశౌర్య కనిపిస్తున్నాడని.. నందినిరెడ్డి దర్శకత్వంలో ఇప్పటికే నాగశౌర్య 'కల్యాణ వైభోగమే' చేశాడు. ఆమె దర్శకత్వ శైలి గురించి అవగాహన వుంది. 
 
సౌత్ కొరియన్ కామెడీ డ్రామా 'మిస్ గ్రానీ'ని మక్కికి మక్కిగా రీమేక్ చేయకుండా... తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేస్తానని, హీరో క్యారెక్టర్ వెయిట్ పెంచుతానని నాగశౌర్యకు నందినిరెడ్డి ప్రామిస్ చేస్తారట. ఆమె మాటకు విలువనిచ్చి ఈ సినిమా చేసేందుకు నాగశౌర్య రెడీ అవుతున్నట్లు టాక్. ఏమైతేనేమీ స్టార్ హీరోయిన్ సమంత సరసన నటించే అవకాశం లభించినట్టే కదా.. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments